ETV Bharat / international

ఇరాన్​లో 853కు చేరుకున్న కరోనా మరణాలు - ఇరాన్​లో 853కు చేరుకున్న కరోనా మరణాలు

కరోనా వ్యాప్తితో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇరాన్​లో తాజాగా వైరస్​ ధాటికి మరో 129 మంది మృతిచెందినట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో అక్కడ మరణాల సంఖ్య 853కు చేరుకుంది. స్పెయిన్​లో 24 గంటల వ్యవధిలో సుమారు 1000 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Iran says virus kills another 129 people, toll rises to 853
ఇరాన్​లో 853కు చేరుకున్న కరోనా మరణాలు
author img

By

Published : Mar 16, 2020, 7:48 PM IST

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తోంది. మహమ్మారి ప్రభావం ఇరాన్​లో తీవ్రంగా కనిపిస్తోంది. ఒక్కరోజే వైరస్​ బారిన పడి మరో 129 మంది మృతిచెందినట్లు ఆ దేశ అధికారులు సోమవారం వెల్లడించారు. దీంతో అక్కడ మొత్తం మరణాల సంఖ్య 853కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా 14, 991 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు.

ఇరాన్​ అసెంబ్లీ సీనియర్​ నేత అయతోల్లా హషేమ్ బేతాయ్ (78) వైరస్ సోకి మరణించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అంతేకాకుండా కేబినెట్​ మంత్రులు, పార్లమెంట్​ సభ్యులు, రెవల్యూషనరీ గార్డ్​ మెంబర్స్​, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు వైరస్​ బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇరాన్​ ప్రభుత్వం మొత్తం లక్షా పదివేల పడకలను సిద్ధం చేసింది.

స్పెయిన్​లో జాతీయ విపత్తుగా..

స్పెయిన్​లో 24 గంటల వ్యవధిలో దాదాపు వెయ్యి కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య వర్గాలు వెల్లడించాయి. తాజా కేసులతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 8,744కు చేరింది. ఇందులో దేశ రాజధాని మాడ్రిడ్​లో 4,665 కేసులు నమోదుకావడం గమనార్హం.

తాజాగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాలు 297కి చేరినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్పెయిన్ ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది. 46 మిలియన్ల మంది గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

కరోనాపై అవగాహన...

అమెరికాలో కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు సాయం చేయడం కోసం సేవా ఇంటర్నేషనల్​ సంస్థ, ఇండో- అమెరికా స్వచ్ఛంద సంస్థలు కలిసి పని చేస్తున్నాయి. 20 మంది డాక్టర్లతో 24గంటల పాటు కరోనా అవగాహన కార్యక్రమాలను చేపట్టడానికి 10 వేల అమెరికన్​ డాలర్లను కేటాయించాయి.

కలిసి పోరాడుదాం..

కరోనాను కట్టడి చేయడంపై ఐరోపా సమాఖ్య​ నేతలు వీడియో కాన్ఫరెన్స్​లో చర్చించారు. మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడదాం అని పిలుపునిచ్చారు.

ఇది చదవండి: కరోనా దెబ్బకు అమెరికా 14 రోజులు బంద్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.