భారతీయ మూలాలు ఉన్న ఓ వ్యక్తి కొవిడ్ సమయంలో బ్రిటన్‌లో చేసిన సేవలకు అరుదైన గుర్తింపు లభించింది. అమృత్‌పాల్ సింగ్ మాన్ అనే వ్యక్తి బ్రిటన్‌లో పంజాబ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. యుకేలోని అతి పురాత నార్త్ ఇండియన్ రెస్టారెంట్లలో ఇది కూడా ఒకటి. కొవిడ్ సమయంలో దాదాపు రెండు లక్షల మందికిపైగా నిరుపేదలకు ఆహారాన్ని అందించారు మాన్.
ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం 'న్యూ ఇయర్ హానర్ లిస్ట్ 2022'లో అమృత్‌పాల్ సింగ్ మాన్ పేరును కూడా చేర్చింది. ఆయన చేసిన సేవలకు 'ఆఫీసర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్' గౌరవాన్ని ఇచ్చింది. దీనిపై అమృత్‌పాల్ ట్విట్టర్‌లో స్పందిస్తూ "నాకు సందేశాలు పంపిన వారికి ధన్యవాదాలు. సేవ చేసేలా నన్ను ప్రేరేపించిన ప్రతిఒక్కరికీ ఇది చెందుతుంది" అని పేర్కొన్నారు.
ఈ గౌరవం పొందిన వారిలో దవీందర్ సింగ్ ధిల్లాన్ కూడా ఉన్నారు. తొలి ప్రపంచ యుద్ధంలో మరణించిన భారతీయ సైనికుల స్మారక బృందానికి ఆయన అధ్యక్షుడు. తొలి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల జ్ఞాపకార్థం దీనిని అందజేశారు. ఇక భారత్ విద్యావేత్త అజేయ్ కుమార్ కక్కర్‌కు నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గౌరవాన్ని అందించారు. వైద్య రంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా దీనిని ఇచ్చారు.
ఇదీ చూడండి: సామాన్యుల బ్యాంక్ ఖాతాల్లోకి పొరపాటున రూ.1,300 కోట్లు.. చివరకు...