ETV Bharat / international

జీ-7 సదస్సులో కరోనా కలకలం! - S Jaishankar news

జీ-7 సదస్సులో భారత్‌ తరఫున హాజరైన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో భారత బృందం మొత్తం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు మాత్రం పాజిటివ్‌ రాలేదని బ్రిటన్​ మీడియా వెల్లడించింది.

G-7 meeting
జీ-7 సదస్సులో కరోనా కలకలం!
author img

By

Published : May 5, 2021, 5:18 PM IST

లండన్‌లో జరుగుతోన్న జీ-7 విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో కరోనా వైరస్ కలకలం సృష్టించింది. భారత్‌ తరఫున హాజరైన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. దీంతో భారత బృందం మొత్తం ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. జీ7 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌కు మాత్రం పాజిటివ్‌ రాలేదని అక్కడి మీడియా వెల్లడించింది.

'బృంద సభ్యుల్లో కొందరికి వైరస్‌ సోకినట్లు తెలిసింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా నేను పాల్గొనాల్సిన అన్ని కార్యక్రమాలకు వర్చువల్‌ విధానంలో హాజరుకావాలని నిర్ణయించుకున్నాను. నేడు జరిగే జీ7 సమావేశంలోనూ వర్చువల్‌ పద్ధతిలోనే పాల్గొంటాను' అని భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్‌ జయశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

జీ-7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం లండన్‌లో జరుగుతోంది. సభ్య దేశాలతో పాటు ఆతిథ్య దేశ హోదాలో భారత్‌ ఈ సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటోంది. ఇందులో భాగంగా విదేశాంగశాఖ మంత్రి నేతృత్వంలోని భారత బృందం అక్కడకు చేరుకుంది. జీ7 శాశ్వత సభ్య దేశాలతో పాటు భారత్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా దేశాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి.

ఇదీ చూడండి: భారత్​లో అమెరికా రాయబారిగా లాస్​ఏంజెల్స్​ మేయర్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.