ETV Bharat / international

జీవాయుధాలను తక్షణం నిషేధించాలి: భారత్​ - భారత్​ జీవాయుధాల వినియోగం

Ban Of Biological Weapons: ఉక్రెయిన్​, రష్యా యుద్ధ నేపథ్యంలో జీవాయుధాల వినియోగం మరో మారు తెర మీదకు వచ్చింది. అయితే వీటిని వినియోగించడాన్ని భారత్​ ముక్త కంఠంతో ఖండించింది. ఎవరూ ఏ రూపంలో వినియోగిచరాదని ఐరాస వేదికగా చెప్పింది.

India Backs Ban Of Biological Weapons At UN Security Council
జీవాయుధాలను తక్షణం నిషేధించాలి: భారత్​
author img

By

Published : Mar 19, 2022, 10:23 AM IST

Ban Of Biological Weapons: సామూహిక విధ్వంసానికి దారి తీసే జీవాయుధాలను ఎవరూ ఏ రూపంలోనూ వినియోగించరాన్న వైఖరిని భారత్​ మరోమారు స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జీవాయుధ యుద్ధంగా మారకుండా.. తక్షణమే జీవరసాయన, జీవాయుధ నిషేధ ఒప్పందం (బీసీడబ్ల్యూసీ) తేవాలని నొక్కి చెప్పింది.

ఉక్రెయిన్​లో ప్రస్తుత పరిస్థితుల పట్ల తీవ్ర ఆందోళన వెలిబుచ్చిన భారత్​.. సమస్యను ఇరుపక్షాలు చర్చలతోనే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది. రష్యా, ఉక్రెయిన్​లు శత్రుత్వాలను వదిలి చర్చలు సాగిస్తేనే ఈ ప్రాంతంలో శాంతికి బాటలు పడతాయని ఐరాసలో భారత శాశ్వత రాయబారి ఆర్​. రవీంద్ర అన్నారు. ఇరు దేశాల మధ్య తాజాగా మరోమారు దౌత్య చర్చలు మొదలవడాన్ని ఆయన స్వాగతించారు.

ఇదీ చూడండి:

'వైద్యుడితోనైనా బాక్సింగ్‌ చేసేంత బలంగా ఉన్నా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.