ETV Bharat / international

ఐరాసలో వీగిన రష్యా తీర్మానం- ఓటింగ్​కు భారత్ దూరం

Russia Ukraine News: ఉక్రెయిన్​లో మానవతా సంక్షోభం ఉందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. భారత్​తో పాటు మరో 12 సభ్యదేశాలు ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. మరోవైపు ఉక్రెయిన్​కు నాటో దేశాలు ఆయుధాలతో పాటు అపరిమిత సాయం అందించాలని అధ్యక్షుడు జెలెన్​స్కీ కోరారు. యుద్ధంలో ఇప్పటివరకు 7,000 నుంచి 15,000 మంది రష్యా సైనికులను చనిపోయి ఉంటారని నాటో అధికారి ఒకరు చెప్పారు.

India, 12 others abstain in UNSC on vote on Russian-led draft resolution on Ukraine
ఐరాసలో వీగిన రష్యా తీర్మానం- ఓటింగ్​కు భారత్ దూరం
author img

By

Published : Mar 24, 2022, 11:16 AM IST

Russia Resolution on Ukraine: ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానంపై ఓటింగ్‌కి మొత్తం సభ్యదేశాల్లో భారత్ సహా మరో 12 దేశాలు దూరంగా ఉన్నాయి. రష్యా ప్రవేశపెట్టిన తీర్మానానికి చైనా మాత్రమే మద్దతు తెలిపింది. ఆమోదానికి అవసరమైన 9 ఓట్లు రాకపోవడంతో తీర్మానం వీగిపోయింది. తాను చేస్తున్న దాడులపై ప్రస్తావించకుండానే ఉక్రెయిన్‌లో మానవతా సంక్షోభంపై రష్యా తీర్మానం ప్రవేశపెట్టింది. అనుకూలంగా ఓటు వేయాలని సభ్యదేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ ప్రజల సురక్షిత తరలింపునకు వీలుగా మానవతా సాయన్ని సులభతరం చేయాలని కోరింది. భారత్​తో పాటు మరో 12 సభ్యదేశాలు ఈ తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ చేస్తోందనే 13 సభ్య దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయని అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ అన్నారు. తాను సృష్టించిన మానవతా సంక్షోభాన్ని పరిష్కరించమని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతూ రష్యా తీర్మానం ఇవ్వడం అన్యాయమన్నారు. అటు రష్యా తీర్మానంపై ఓటింగ్‌కు దూరంగా ఉన్న భారత్.. గతంలో మాస్కోకు వ్యతిరేకంగా ఇతర దేశాలు తీర్మానాలు ఇచ్చినా ఇదే వైఖరిని అవలంబించింది.

Russia Ukraine War: మాస్కోలోని అమెరికా ఎంబసీ నుంచి అనేక మంది అమెరికా దౌత్యవేత్తలను రష్యా బహిష్కరించింది. ఈ మేరకు తాము ఇచ్చిన జాబితా అమెరికా ఎంబసీకి చేరిందని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి.. రష్యా మిషన్‌కు చెందిన 12మంది దౌత్యవేత్తలను అమెరికా ఈనెల ఆరంభంలో బహిష్కరించింది. వారంతా గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతూ అమెరికాలో తమ నివాస హక్కులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను శత్రువు చర్యగా అభివర్ణించిన రష్యా, అగ్రరాజ్యం నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది. తాజాగా మాస్కోలోని అమెరికా దౌత్యవేత్తలను బహిష్కరించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో, ఇరు దేశాలు పరస్పరం ఆంక్షలు విధించుకున్నాయి. అటు రష్యా తాజా చర్యలను తప్పుపట్టిన అమెరికా.. ఇది ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. వెంటనే తమ దౌత్యవేత్తలపై విధించిన బహిష్కరణలను ఎత్తివేయాలని రష్యాను కోరింది.

Russia Ukraine Crisis: నాటో సమావేశంలో మాట్లాడిన ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ తమకు సమర్థవంత, అపరిమిత సాయం అందించాలని కూటమి దేశాలను కోరారు. తమ దేశంపై దురాక్రమణకు దిగిన రష్యా దండయాత్రను నిరోదించడానికి, ఉక్రెయిన్​లో శాంతి పునరద్ధరణకు ఆయుధాలతో పాటు అవసరమైన మద్దతు అందించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు యుద్ధంలో ఇప్పటివరకు 7,000 నుంచి 15,000మంది రష్యా సైనికులు మరణించి ఉంటారని నాటో అధికారి చెప్పారు. ఇవి తాము స్వయంగా పరిశీలించిన తర్వాత ఓ అంచనాకు వచ్చిన లెక్కలని పేర్కొన్నారు. యుద్ధంలో 1300మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని రెండు వారాల క్రితం జెలెన్​స్కీ ప్రకటించారు.

Russia Journalist Dead: యుద్ధ పరిస్థితులను క్షేత్రస్థాయిలో చిత్రీకరించేందుకు వెళ్లిన రష్యా జర్నలిస్ట్​ ఒక్సానా బౌలినా.. కీవ్​లో జరిగిన షెల్లింగ్​లో మరణించారని ఆ దేశ వార్తా సంస్థ తెలిపింది. పొడిల్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో మరో పౌరుడు కూడా చనిపోయాడని తెలిపింది. బౌలినాకు సాయంగా మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. ది ఇన్​సైడర్​లో జర్నలిస్టుగా పనిచేస్తున్న బౌలినా.. అంతకుముందు రష్యా ప్రతిపక్షనేత నావల్నీకి చెందిన అవినీతి నిరోదక సంస్థ కోసం పనిచేసింది. అయితే అది అతివాద సంస్థ అని రష్యా ప్రభుత్వం ప్రకటించాక ఆమె దేశం వీడి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఉక్రెయిన్​లో పరిస్థితులపై డాక్యుమెంటరీ తీస్తోంది. ఈ క్రమంలోనే దాడిలో మరణించింది.

ఇదీ చదవండి: యుద్ధానికి నెల రోజులు.. రష్యా లక్ష్యం నెరవేరిందా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.