Hungary accident today: హంగేరీలో జరిగిన ఓ ప్రమాదంలో ఏడుగురు వలసదారులు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. సెర్బియా-హంగేరి సరిహద్దుల్లో ఉన్న మొరహలోమ్ అనే గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది.
ఇంటిపైకి దూసుకెళ్లి..
Migrants Killed in Hungary: సెర్బియా-హంగేరీ సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సెర్బియాకు చెందిన ఓ మినీ వ్యాన్‌ను ఆపేందుకు ప్రయత్నించగా.. మితిమీరిన వేగంతో దూసుకెళ్లింది.
పారిపోయే ప్రయత్నంలో భాగంగా.. ఓ ఇంటిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. డ్రైవర్ సహా మరో నలుగురు గాయపడ్డారు.
ఈ ఘటనలో డ్రైవర్ను అరెస్ట్ చేశారు పోలీసులు. మానవ అక్రమ రవాణాతో పాటు.. ఘోర ప్రమాదానికి కారణమైన అతనిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: