నార్వేలో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 7కు చేరింది. రాజధాని ఓస్లోకు 25 కిలోమీటర్ల దూరంలోని ఆస్క్ గ్రామంలో ఈ మంచు చరియల ప్రభావం తీవ్రంగా పడింది. నార్వే చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా దీనిని భావిస్తున్నారు.
సురక్షిత ప్రాంతాలకు..
శిథిలాల కింద చిక్కుకున్న కొందరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాణాలతో ఉన్నవారిని రక్షించేందుకు.. రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. డ్రోన్లు, కుక్కల సహాయం తీసుకుంటున్నాయి. శుక్ర, శనివారాల్లో నాలుగు.. ఆదివారం మరో రెండు మృతదేహాలు లభించాయని పోలీసులు తెలిపారు. హెలికాప్టర్ల ద్వారా ఇప్పటివరకూ.. కనీసం 1,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇదీ చదవండి: చర్చిలో కాల్పులు- పాస్టర్ మృతి