మారుతున్న సాంకేతికతకు తగ్గట్టు, పర్యావరణహిత ఇళ్లను రూపొందించారు. దఎవాల్వింగ్ హౌస్ గా పిలిచే ఈ గృహం 2వేల 210 చదరపు అడుగుల్లో నిర్మితమైంది. పనికి రాని వస్తువులను రీ డిజైన్ చేసి ఉపయోగించారు. ఎక్కువ కాలం మన్నిక వచ్చే మెటీరియల్స్ని ఇందులో వాడారు.
"ఈ ఇంట్లోని గదులన్నీ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు విభిన్నంగా రూపొందించారు. ఈ రోజుల్లో ప్రజలు ఒకే రకంగా ఉండేందుకు ఇష్టపడట్లేదు. అన్నిట్లో వైవిధ్యం కోరుకుంటున్నారు." -- సైమన్ గోర్డన్, ఇంటిరీయర్ డిజైనర్.
ఇంట్లో సాయపడేందుకు ఓ రోబోనీఏర్పాటు చేశారు. మనకు తెలియని విషయాలను దీన్ని అడిగి తెలుసుకోవచ్చు. ట్రెండ్‌కు తగ్గట్టుగా రూపొందించిన బెడ్రూమ్తో విపరీతంగా ఆకర్షిస్తోందీ గృహం.
"దీని పేరు టెమీ. ఇంట్లో మీకు సాయపడేందుకు ఈ రోబోని రూపొందించాం. అంతర్జాలంలో మీకు తెలియని విషయాలను దీని ద్వారా తెలుసుకోచ్చు. ఉదాహరణకు టెమీ వెదర్ అంటే ఏమిటి? చూశారా ఎలా ప్రతిస్పందించిందో" -- ఫ్యాబ్రిస్ గొఫిన్, జోరా రోబోటిక్స్ సహ సీఈఓ
విభిన్న రకాల్లో రూపొందించిన ఈ గృహల ధరను స్థాయిని బట్టి లక్షా 32వేల డాలర్లనుంచి 10లక్షల 32వేల డాలర్ల వరకు నిర్ణయించారు.