ETV Bharat / international

గుడ్​న్యూస్​: కరోనాను ఎదుర్కోవడం ఇంకాస్త ఈజీ! - Herd immunity threshold to Covid-19 could be lower than previously thought

కరోనాను తట్టుకొనే విధంగా హెర్డ్ ఇమ్యునిటీ సాధించడానికి అవసరమయ్యే జనాభా పరిమితి తగ్గినట్లు యూకేలోని నాటింగ్​హమ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. 60 శాతంగా పరిగణించే జనాభా పరిమాణం తాజా పరిశోధనల్లో 43 శాతానికి చేరుకున్నట్లు తెలిపారు.

HERD IMMUNITY
హెర్డ్ ఇమ్యునిటీ
author img

By

Published : Jun 24, 2020, 6:25 PM IST

కరోనావైరస్ బారిన పడకుండా రోగనిరోధక శక్తి సాధించి వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేసే హెర్డ్ ఇమ్యునిటీపై పరిశోధకులు కొత్త విషయాలు వెల్లడించారు. హెర్డ్ ఇమ్యునిటీ సాధించేందుకు ఇదివరకు అంచనావేసిన దానికంటే వ్యాధి సోకేవారి సంఖ్య తగ్గినట్లు తెలిపారు.

ఈ అధ్యయనంలో భాగంగా యూకేలోని నాటింగ్​హమ్​ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఓ గణిత నమూనా తయారు చేశారు. హెర్డ్ ఇమ్యునిటీ సాధించడానికి అవసరమయ్యే జనాభాను గుర్తించడానికి... ప్రజలను వయసు, సామాజిక కార్యాచరణ స్థాయిని ప్రతిబింబించే సమూహాలుగా విభజించారు. ఈ పరిశోధనలో హెర్డ్ ఇమ్యునిటీ స్థాయి 60 శాతం నుంచి 43 శాతానికి పడిపోయినట్లు గుర్తించారు.

వైరస్ బారినపడిన వ్యక్తులు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం సహా వ్యాక్సిన్​ ప్రయోగించడం ద్వారా హెర్డ్ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యాధిని ఎక్కువ శాతం జనాభా తట్టుకోగలిగితే వైరస్ వ్యాప్తి మందగించి.. తర్వాత ఆగిపోతుందని తెలిపారు. కరోనా వైరస్​కు హెర్డ్ ఇమ్యూనిటీని సాధారణంగా 60 శాతంగా పరిగణిస్తారని చెప్పుకొచ్చారు. అయితే తాజా పరిశోధనలో ఇది తగ్గినట్లు తెలిపారు.

"కొత్త గణిత నమూనా ప్రకారం హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయి 43 శాతానికి తగ్గింది. వయసు క్రమంతో సంబంధం లేకుండా ప్రజల కార్యాచరణ స్థాయిని బట్టి ఈ తగ్గుదల నమోదైంది."

-ఫ్రాంక్ బాల్, పరిశోధకుడు, నాటింగ్​హమ్ విశ్వవిద్యాలయం

వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి వీరికి వ్యాక్సిన్ ముందుగానే ఇవ్వాల్సి ఉంటుందని పరిశోధకులు తెలిపారు. జనాభాలో ప్రతి వ్యక్తికి టీకా వేసే అవకాశాన్ని ఈ సంఖ్య సూచిస్తోందన్నారు.

సామాజికంగా చురుకుగా ఉండే వ్యక్తులకు వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒకవేళ వారికి వైరస్ సోకితే.. మరింత మందికి వ్యాప్తి చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. వ్యాక్సినేషన్​తో పోలిస్తే వైరస్ వ్యాప్తి ద్వారా వచ్చే హెర్డ్ ఇమ్యూనిటీ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.