స్వీడన్‌కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ ఒక్క చోట చేరారు. ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో వీరు కలుసుకున్నారు.
-
So... today I met my role model. What else can I say? @Malala pic.twitter.com/n7GnXUngov
— Greta Thunberg (@GretaThunberg) February 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">So... today I met my role model. What else can I say? @Malala pic.twitter.com/n7GnXUngov
— Greta Thunberg (@GretaThunberg) February 25, 2020So... today I met my role model. What else can I say? @Malala pic.twitter.com/n7GnXUngov
— Greta Thunberg (@GretaThunberg) February 25, 2020
వీరిద్దరు కలుసుకున్న ఫొటోలను ఇరువురూ తమ సామాజిక మధ్యమాలలో పోస్ట్ చేశారు. తన రోల్ మోడల్‌ను కలిసినందుకు సంతోషంగా ఉందని గ్రెటా ట్విట్టర్లో రాసుకొచ్చింది. ఈ యువ కార్యకర్తలిద్దరినీ ఒకే ఫొటోలో చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. అయితే వీరు ఏ విషయాలపై చర్చించుకున్నారన్నది తెలియలేదు.
ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు మలాలా. బ్రిస్టల్‌లో ఈ వారం జరగనున్న ఓ పాఠశాల సమ్మెలో పాల్గొనేందుకు గ్రెటా లండన్‌కు వచ్చినట్లు సమాచారం.
గ్రెటా థన్‌బర్గ్
పర్యావరణాన్ని కాపాడేందుకు గ్రెటా థన్‌బర్గ్(17) రెండేళ్ల క్రితం స్వీడన్ పార్లమెంట్ ముందు ప్రతీవారం నిరసన చేయడం ప్రారంభించారు. క్రమక్రమంగా ఆ నిరసన ఉద్యమంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యావరణం కోసం నిరసన చేసేలా ప్రభావితం చేసింది.
మలాలా
పాకిస్థాన్‌కు చెందిన మలాలా(22) బాలికలకు పాఠశాల విద్య కోసం పాటుపడ్డారు. 2012లో పాఠశాల నుంచి తిరిగి వస్తున్న క్రమంలో తాలిబన్ల బీకర కాల్పులను ఎదుర్కొన్నారు. మృత్యువును జయించిన మలాలా... అనంతరం బర్మింగ్హమ్కు నివాసాన్ని మార్చారు. ఆమె చూపిన తెగువకు 2014లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఈ అవార్డు తీసుకున్న అత్యంత పిన్న వయస్కురాలు మలాలానే కావడం విశేషం.