ETV Bharat / international

ఐరోపాలో తగ్గిన కేసులు-రష్యా, బ్రెజిల్​లో పెరిగిన తీవ్రత - బ్రెజిల్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఐరోపాలో కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుతుంటే.. అమెరికా దేశాల్లో మరింత తీవ్రమవుతున్నాయి. అమెరికా, కెనడా, బ్రెజిల్​, మెక్సికో దేశాలు అధికంగా ప్రభావమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 36 లక్షల మందికిపైగా కరోనా బారినపడగా.. 2 లక్షల 52 వేల మందికిపైగా మరణించారు.

Global COVID-19 tracker
ఐరోపాలో మళ్లీ తగ్గిన కేసులు-అమెరికా దేశాల్లో తీవ్రం
author img

By

Published : May 5, 2020, 7:03 AM IST

Updated : May 5, 2020, 7:56 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 36 లక్షల 43 వేలు దాటింది. ఇప్పటివరకూ 2 లక్షల 52 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల 94 వేల మందికిపైగా కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

ఐరోపాలో వైరస్​ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంటే.. మరోవైపు అమెరికా దేశాల్లో కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూఎస్​ఏ, కెనడా, మెక్సికో, బ్రెజిల్​లు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.

అమెరికాలో కేసులు 12 లక్షల 12 వేలు దాటాయి. మొత్తం మరణాల సంఖ్య 70 వేలకు చేరువైంది. 24 గంటల వ్యవధిలో దేశంలో 1015 మంది మరణించినట్లు జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ వెల్లడించింది. నెల వ్యవధిలో ఇదే స్వల్పమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

బ్రెజిల్​లో ఒక్కరోజే 318 మంది మరణించగా.. కొత్తగా 7 వేల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. కెనడాలో మరో 172, మెక్సికోలో 93 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఐరోపా దేశాల్లో...

  • స్పెయిన్​లో కరోనా మరో 164 మందిని బలితీసుకుంది. మృతుల సంఖ్య 25 వేల 428కి పెరిగింది. మొత్తం కేసులు 2 లక్షల 48 వేలు దాటాయి.
  • ఇటలీలో కొత్తగా 195 మంది చనిపోయారు. మొత్తం మరణాలు... 29 వేల 79కి చేరాయి.
  • బ్రిటన్‌లో సోమవారం కనిష్ఠంగా 288 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 28 వేల 734కి పెరిగింది. దేశంలో కొత్తగా 4 వేల కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య లక్షా 90వేలు దాటింది.
  • ఫ్రాన్స్‌లో మరో 306 మంది మరణించగా.. కరోనా కేసులు లక్షా 69 వేల 462కు చేరాయి. మొత్తం 25 వేల 200 మంది చనిపోయారు.
  • జర్మనీలో లక్షా 66 వేలపైగా మందికి కరోనా సోకింది. మరో 127 మంది చనిపోగా ఇప్పటి వరకు 6 వేల 866 మరణాలు సంభవించాయి.

రష్యాలో అంతకంతకూ..

రష్యాలోనూ కరోనా శాంతించడంలేదు. కొత్తగా 10వేలకుపైగా కేసులు నమోదుకాగా మొత్తం కేసులు లక్షా 45 వేలు దాటాయి. ఇప్పటివరకు 13 వందలకుపైగా బాధితులు వైరస్ కారణంగా మరణించారు. టర్కీలోనూ వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య లక్షా 27 వేల 659కి చేరింది. 3 వేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.

ఇరాన్‌లో 98 వేల 647 మందికి కరోనా సోకగా మృతుల సంఖ్య 6 వేల 277కి చేరింది. పాకిస్థాన్‌లో మృతుల సంఖ్య 476కు చేరింది. బాధితుల సంఖ్య 20 వేల 941కి పెరిగింది. న్యూజీలాండ్‌లో కొత్త కేసులేవీ నమోదు కాలేదని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated : May 5, 2020, 7:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.