ETV Bharat / international

బ్రిటన్​ను వణికిస్తున్న కరోనా.. 28వేలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 35 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు అన్ని దేశాల్లో కలిపి 2, 44, 600 మందికి పైగా మరణించారు. మరో 11 లక్షల మంది కోలుకున్నారు. ఫ్రాన్స్​లో కనిష్ఠంగా 166 కొత్త మరణాలు సంభవించాయి. మరో 1050 కేసులు నమోదయ్యాయి. అమెరికాలో ఒక్కరోజు వ్యవధిలో మరో 1435 మంది చనిపోయారు.

author img

By

Published : May 3, 2020, 6:43 AM IST

Updated : May 3, 2020, 6:00 PM IST

Global COVID-19 tracker
బ్రిటన్​ను వణికిస్తోన్న కరోనా.. 28 వేలు దాటిన మరణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బాధితుల సంఖ్య 35 లక్షలను సమీపించింది. ఇప్పటివరకు 2 లక్షల 44 వేల 600 మందికిపైగా వైరస్​కు బలయ్యారు. మరో 11 లక్షల మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

జాన్స్​ హాప్కిన్స్​ వర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 1435 మంది చనిపోగా ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 67 వేల 400 దాటింది. దేశంలో వైరస్​ కేసులు 11 లక్షల 60 వేలకుపైనే ఉన్నాయి. మరో లక్షా 60 వేలమందికిపైగా నయమైంది.

వణుకుతున్న యూకే..

ఐరోపాలోని బ్రిటన్‌లో రోజువారీ మృతుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. అక్కడ శనివారం మరో 621 మంది మృత్యువాతపడ్డారు. దేశంలో మొత్తం మరణాలు 28వేల 131కి చేరాయి.

24 గంటల వ్యవధిలో ఇటలీలో 474, స్పెయిన్​లో 276 మంది చనిపోగా.. ఫ్రాన్స్​లో వరుసగా రెండో రోజూ మరణాలు భారీగా తగ్గాయి. శనివారం అక్కడ 166 మంది చనిపోగా.. 1050 కొత్త కేసులు నమోదయ్యాయి.

  • జర్మనీలో శనివారం నాడు 76 మంది చనిపోగా... రష్యాలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యాలో కేసుల సంఖ్య లక్ష 25 వేలకు చేరువైంది.
  • బెల్జియంలో 62 మంది, నెదర్లాండ్స్‌లో 94 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కెనడాలో గడిచిన 24 గంటల్లో 175 మంది చనిపోగా మెక్సికోలో 113 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రపంచంలో మరో పెద్ద హాట్‌స్పాట్‌గా మారిన బ్రెజిల్‌లో శనివారం 340 మంది చనిపోగా.. కేసుల సంఖ్య 97 వేలకు చేరవైంది. ఈక్వెడార్‌లో నిన్న 308 మంది ప్రాణాలు విడిచారు.

  • సింగపూర్​లో మరో 447 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 17 వేల 500 దాటింది.
  • పాకిస్థాన్​లో ఒక్కరోజే 930 మంది కొవిడ్​ బారినపడ్డారు. మరో 20 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 437కు చేరింది.

Last Updated : May 3, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.