ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 4 కోట్లకు చేరువలో కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతూనే ఉంది. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్లకు చేరువైంది. వైరస్​కు బలైన వారి సంఖ్య 11 లక్షలు దాటింది. అధిక జనాభా కలిగిన దేశాలతో పాటు చిన్న చిన్న దేశాల్లోనూ వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికా, భారత్​లో వేగంగా వ్యాప్తి చెందుతుండగా.. బ్రెజిల్​, రష్యాల్లో కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.

global-covid-19
కరోనా మహా విలయం
author img

By

Published : Oct 17, 2020, 10:42 AM IST

ప్రపంచంపై కరోనా రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. మహా విలయంలో లక్షల మంది బలవుతున్నారు. రోజు రోజుకు లక్షల మంది వైరస్​ బారినపడుతున్నారు. ఒక్కరోజు వ్యవధిలో 4.17 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4 కోట్లకు చేరువైంది.

మొత్తం కేసులు: 39,586,909

మరణాలు: 1,109,130

కోలుకున్నవారు: 29,658,575

యాక్టివ్​ కేసులు: 8,819,204

  • అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఆర్థిక, సామాజిక కార్యక్రమాలు ఊపందుకున్న క్రమంలో రోజు రోజుకు కొత్త కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం 70వేలకుపైగా కొత్తగా వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 83 లక్షలకు చేరువైంది.
  • బ్రెజిల్​లో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో 30 వేల కేసులు వచ్చాయి. 716 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 52 లక్షలు, మరణాలు 1.53 లక్షలు దాటాయి.
  • చైనాలో కరోనా వైరస్​ మళ్లీ పుంజుకుంటోంది. శుక్రవారం కొత్తగా 13 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే.. మొత్తం విదేశీయులేనని తెలిపింది. దేశంలో విదేశాల నుంచి వచ్చిన కేసుల సంఖ్య 3,097కు చేరినట్లు వెల్లడించింది.
  • కెనడాలో రోజువారి కేసుల సంఖ్యలో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. గత వారం రోజులుగా సగటున రోజుకు 2,300లకు పైగా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసుల వివరాలు...

దేశంమొత్తం కేసులుమరణాలు
అమెరికా8,288,278223,644
బ్రెజిల్5,201,570153,229
రష్యా1,369,31323,723
స్పెయిన్982,72333,775
అర్జెంటీనా965,60925,723
కొలంబియా945,35428,616
పెరు862,41733,648
మెక్సికో841,66185,704

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.