ETV Bharat / international

కరోనా వైరస్​ను కసితీరా తినాలనుందా? అయితే పదండి.. - కరోనా వైరస్​

ఓ వైపు కరోనాతో వందలాది మంది మరణిస్తుంటే.. దాన్ని వ్యాపార అస్త్రంగా మార్చుకుంది ఓ బేకరి. కరోనా వైరస్​ ఆకృతిలో పేస్ట్రీ (కేక్​​)లను తయారు చేసి వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆ విషయాలెంటో చూద్దామా?

corona
కరోనా కేక్​
author img

By

Published : Feb 29, 2020, 6:41 PM IST

Updated : Mar 2, 2020, 11:44 PM IST

అనేక దేశాలను గజగజ వణికిస్తోంది కొవిడ్​-19(కరోనా). ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే హాట్​ టాపిక్​. ఈ విషయాన్ని తమ వ్యాపారానికి అనుకూలంగా మార్చుకుంది ఇటలీ జెనోవాలో ఓ ప్రముఖ బేకరి. కరోనా వైరస్​ ఆకారంలో కేకులను తయారు చేసింది. దీనికి స్థానికుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

నగరంలోని ప్రముఖ బేకరి 'మాంగినా 1876 బార్​ అండ్​ పాటిస్సెరీ'కి చెందిన ప్రధాన చెఫ్​.. ఇతర సిబ్బందితో కలిసి సరదాగా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో వారికి కరోనా వైరస్​పై పేస్ట్రీలు తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది.

రెండు రకాల్లో..

అనుకున్నదే తడవుగా కరోనా వైరస్​ను సీడీసీ కంప్యూటర్​ రూపొందించిన చిత్రం ఆకారంలో కేక్​ను తయారు చేశారు. మొత్తంగా రెండు ఆకృతుల్లో రూపొందించారు. ఒకదాన్లో చాకొలేట్​ డోమ్​పై జపనీస్​ క్రీమ్​.. ఆపైన నారింజ రంగు పువ్వులను పేర్చారు. మరోదాంట్లో నారింజ రంగుకు బదులుగా కాఫీని ఉపయోగించారు.

ఈ పేస్ట్రీలకు భారీ డిమాండ్ వస్తోన్నా.. కొంతమంది మాత్రం విమర్శిస్తున్నారు. ఇటువంటి విషయాల్లో సరదా ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఇటలీలో 17 మంది..

ఇటలీలో ఇప్పటివరకు 650 కరోనా వైరస్​ కేసులు నమోదయ్యాయి. 17 మంది చనిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా 82 వేల కేసులు నమోదు కాగా 2,800 మంది మరణించారు.

ఇవీ చూడండి:

Last Updated : Mar 2, 2020, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.