ఇటలీలోని ఓ నర్సింగ్ హోంలో ఘోర ప్రమాదం సంభవించింది. రోమ్ నగరం.. లానువియోలోని ఈ నర్సింగ్ హోమ్‌లో గ్యాస్ లీక్ కావడం వల్ల.. ఐదుగురు వృద్ధులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అవ్వడమే ప్రమాదానికి కారణమని అక్కడి అగ్నిమాపక సిబ్బంది ధ్రువీకరించారు. ఈ దుర్ఘటన అనంతరం.. మిగిలన రోగుల్ని మరో ప్రత్యేక కొవిడ్ వైద్యశాలకు తరిలించారు అధికారులు.
ఇదీ చదవండి: ఐదు రోజుల్లోనే 6500 గదుల ఆసుపత్రి నిర్మాణం