మధుమేహ వ్యాధిగ్రస్థుల కోసం తప్పుడు మందును రూపొందించి వేల మంది కారణమయినందుకు ఫ్రాన్స్‌కు చెందిన సెర్వియర్ లేబరేటరీస్ అనే ఔషధ సంస్థకు రూ.1,375 కోట్ల జరిమానా విధిస్తూ సోమవారం ఫ్రాన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
ఏం జరిగింది?
ఆకలిని తగ్గించి, బరువు కోల్పోయేలా చేస్తుందని చెప్పి ఆ కంపెనీ 'మెడియేటర్' అనే బిళ్లలను రూపొందించింది. అయితే ఈ మాత్రల వల్ల దుష్ఫలితాలు కలిగి కనీసం 2,000 మంది మరణించినట్లు అధ్యయనంలో తేలింది. ఈ మందును సవాలు చేస్తూ 6,500 మంది కేసులు దాఖలు చేశారు. 2019-20 మధ్య పది నెలలపాటు వాదనలు కొనసాగాయి. దాదాపు 400 మంది న్యాయవాదులు వాదనలు వినిపించారు. అన్నింటినీ విన్న అనంతరం 1,988 పేజీల పేజీల తీర్పును వెలువరించింది.
సెర్వియర్ కంపెనీకి 2.7 మిలియన్ యూరో(రూ.23 కోట్లు)ల జరిమానా విధించింది. బాధితులకు పరిహారం చెల్లించడం కోసం మరో 159 మిలియన్ యూరోలు(రూ.1,362 కోట్లు) జరిమానా విధించింది.