ETV Bharat / international

అవినీతి కేసులో జైలుకు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు - ఎలక్ట్రానిక్ సంకెళ్ల అరెస్టు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్​ సర్కోజీని దోషిగా తేలుస్తూ ప్యారిస్​ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది.

France''s Sarkozy convicted of corruption, sentenced to jail
అవినీతి కేసులో జైలుకి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు
author img

By

Published : Mar 1, 2021, 7:49 PM IST

ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్​ సర్కోజీపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసులో ప్యారిస్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ కేసులో సర్కోజీని దోషిగా తేలుస్తూ సంచలన తీర్పునిచ్చిన కోర్టు.. ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రెండేళ్ల సస్పెన్షన్​ విధించింది. ఈ మేరకు మొత్తం మూడేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ తీర్పులో ఎలక్ట్రానిక్ సంకెళ్లతో తన ఇంటివద్దే నిర్భందంలో ఉంచేలా అనుమతి కోరేందుకు 66 ఏళ్ల సర్కోజీకి అవకాశం ఉందని కోర్టు తెలిపింది.

అక్రమాలు..

2007-12 మధ్య ఫ్రాన్స్ అధ్యక్షునిగా సేవలందించిన సర్కోజీ.. ఒక కేసులో తనపై తీసుకోబోయే చర్యలకు సంబంధించిన సమాచారాన్ని సీనియర్ మేజిస్ట్రేట్​ వద్దనుంచి అక్రమంగా పొందేందుకు యత్నించారనే ఆరోపణలు రుజువయ్యాయి.

2012 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమంగా విరాళాలందించిన కేసు విచారణనూ.. సర్కోజీ ఇదే నెలలో ఎదుర్కోనున్నారు.

ఇదీ చదవండి: పరువు నష్టం కేసులో 'నావల్నీ'కి జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.