ETV Bharat / international

మోదీ, మెక్రాన్ నూతన ఏడాది చర్చల్లో కశ్మీర్ అంశం!

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరంలో తొలిసారి ఫోన్​లో సంభాషణ సాగించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సహా జమ్ముకశ్మీర్ అంశంపై దేశాధినేతలు చర్చించారు. ఉద్రిక్తతలు తగ్గించడానికి బాధ్యతాయుతంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అగ్రనేతల మధ్య కశ్మీర్​ అంశం ప్రస్తావనకు వచ్చింది. కశ్మీర్​లో పరిస్థితులను నిశితంగా గమనిస్తూనే ఉంటామని ఫ్రాన్స్ ప్రకటించడం గమనార్హం.

Kashmir is the topic of Modi and Macron's New Year's debates!
మోదీ, మెక్రాన్ నూతన ఏడాది చర్చల్లో కశ్మీర్ అంశం!
author img

By

Published : Jan 14, 2020, 10:43 AM IST

నూతన సంవత్సరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్​- భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన అధికారిక టెలిఫోన్ సంభాషణలో కీలక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సహా కశ్మీర్​ అంశంపైనా అగ్ర నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి సమగ్ర ప్రణాళిక(జేసీపీఏ)లో సంతకం చేసిన పీ5 దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి కాగా.. ఇరాన్​తో జరిగిన ఈ అణు ఒప్పందం నుంచి అమెరికా 2018లోనే వైదొలిగింది. ఉక్రెయిన్ విమానం కూల్చివేత ఘటన సహా ఇరాన్-అమెరికాల మధ్య ఇటీవలే చెలరేగిన ఉద్రిక్తతల నడుమ ఫ్రాన్స్ శాంతి మంత్రం జపిస్తోంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని హితవు పలికింది. ప్రస్తుతం భారత్​ వైఖరీ ఇదే. గల్ఫ్ ప్రాంతంలో దాదాపు 80 లక్షల మంది భారతీయులు నివాసం ఉంటున్న నేపథ్యంలో.. పశ్చిమాసియా ప్రాంతంలో తలెత్తే ఉద్రిక్తతలు భారత్​పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనితో పాటు ఇంధన భద్రత కోసం భారత్​ నిర్మిస్తున్న వ్యూహాత్మకంగా కీలకమైన చాబహర్ ఓడరేవుపైనా ప్రభావం పడనుంది.

ఈ నేపథ్యంలో జనవరి 10న మోదీ-మెక్రాన్​ల ఫోన్ సంభాషణ అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడి అధికార నివాసం ఓ ప్రకటన విడుదల చేసింది. 'పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ఆవశ్యకతపై ఫ్రాన్స్ అధ్యక్షుడు, భారతదేశ ప్రధానమంత్రి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇరువైపుల వారిని సంయమనం పాటించాలని కోరుతూ.. ఉద్రిక్తతలు తగ్గించడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు' అని ప్రకటనలో వెల్లడించింది.

'కశ్మీర్​ను గమనిస్తున్నాం'

అమెరికా, నార్వే, దక్షిణ కొరియా రాయబారుల కశ్మీర్ పర్యటనకు ఒక్క రోజు ముందు ఇరుదేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో భాగంగా కశ్మీర్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఐరోపా దేశాల రాయబారులను సైతం కశ్మీర్ పర్యటనకు ఆహ్వానిస్తామని విదేశాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐరోపా దేశాలన్నింటితో భారత్ చర్చలు జరుపుతోంది. భవిష్యత్తులో జరిగే ఈ పర్యటనలో ఫ్రాన్స్ దేశాల అధికారులు సైతం పాల్గొనే అవకాశం ఉంది. 'ఇరుదేశాల మధ్య ఉన్న నమ్మకమైన సంబంధాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు, భారత ప్రధాని మధ్య కశ్మీర్​లోని పరిస్థితుల అంశంపై చర్చించారు. ఫ్రాన్స్ ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తూనే ఉంటుంది' అని ప్రకటన స్పష్టం చేసింది.

మరోవైపు ఐరోపా రాయబారులు కశ్మీర్​లో పర్యటించడానికి విముఖత చూపించారంటూ వస్తున్న వార్తలపై విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. జమ్ముకశ్మీర్​లోని పౌరులు, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా నిర్బంధించిన నేతలను కలుసుకునే సౌలభ్యం కల్పించాలని రాయబారులు డిమాండ్ చేశారన్న వార్తలను ఖండించింది. ఐరోపా రాయబారులందరూ కలిసి ప్రయాణించాలని కోరుకుంటున్నందునే వారి పర్యటనకు ప్రత్యేక తేదీని ఖరారు చేయనున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 2019 అక్టోబర్​లో ఐరోపా దేశాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు కశ్మీర్​లో పర్యటించిన విషయం తెలిసిందే. పూర్తి మితవాద ఎంపీలైన వారి పర్యటనపై వివాదాలు చెలరేగాయి. ఈ పర్యటనను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.

కశ్మీర్ పర్యటనలో పాల్గొన్న అమెరికాకు చెందిన రాయబారి కెన్నెత్ జస్టర్​కు ఆ ప్రాంతంలోని సాధారణ పరిస్థితులను భారత అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్​లో రాజకీయ నాయకుల నిర్బంధం సహా సమాచార వ్యాప్తికి నిరోధం కల్పిస్తున్న అంశాలపై అగ్రరాజ్యం ఆందోళన వ్యక్తం చేసింది. 'జమ్ముకశ్మీర్​లో విదేశీ దౌత్యవేత్తల పర్యటనను పరిశీలిస్తున్నాం. కశ్మీర్​లో అంతర్జాలంపై ఆంక్షలు సహా రాజకీయ నాయకులను నిర్బంధంపై ఆందోళనగా ఉంది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని ఆశిస్తున్నాము' అని అమెరికా రక్షణ శాఖ దక్షిణాసియా విభాగం ట్వీట్ చేసింది.

ఇండో ఫ్రాన్స్ వ్యూహాత్మకం

మరోవైపు ఇండో-పసిఫిక్​ ప్రాంత వ్యూహాత్మక సంబంధాలు సహా వాతావరణ మార్పులపై మోదీ, మెక్రాన్​ చర్చించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి సహకరించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నట్లు ఫ్రాన్స్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన స్పష్టం చేసింది. అణు క్షేత్రాలు, మిలిటరీ సహా ఇతర రంగాల్లో సహకారాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడానికి మోదీ, మెక్రాన్​లు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వెల్లడించింది.

--స్మితా శర్మ, సీనియర్ పాత్రికేయురాలు

Intro:Body:

LIVE: Pongal/Sankranti...

https://twitter.com/ANI/status/1216890634037952512

https://twitter.com/ANI/status/1216913622267387904

https://twitter.com/ANI/status/1216910937543692288

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.