పారిస్‌కు చేరిన అఫ్గాన్ శరణార్థుల్లో(afghan refugees) ఒకరిని ఫ్రాన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తికి.. తాలిబన్లతో సంబంధాలున్నాయన్న అనుమానాలతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది...
అఫ్గాన్‌లో తాలిబన్ల(taliban news) ఆక్రమణ నేపథ్యంలో అక్కడి ప్రజలు దేశాన్ని వీడేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. అనేక మంది ఇప్పటికే విమానాల్లో ఇతర దేశాలకు వలసవెళ్లారు. వీరిలో 1,000కిపైగా మందికి ఫ్రాన్స్ ఆశ్రయమిస్తోంది.
అలా వచ్చిన అఫ్గాన్వాసుల్లో ఐదుగురిపై ఫ్రాన్స్ అధికారులు నిఘా పెట్టారు. క్వారంటైన్లో భాగంగా తొలుత వారికి పారిస్‌లోని ఓ హోటల్లో గదినిచ్చారు. వారిలో ఒకడు అక్కడి నుంచి పారిపోయాడు. గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం పోలీసులు అతడిని పట్టుకున్నారు.
విచారణలో భాగంగా తాను తాలిబన్లతో కలిసి పనిచేసినట్టు ఆ వ్యక్తి అంగీకరించాడు.
ఇదీ చూడండి:- తాలిబన్లతో అమెరికా సీఐఏ రహస్య చర్చలు