ETV Bharat / international

కరోనా కలవరం... ఫ్రాన్స్​లో ఒకే రోజు లక్ష కేసులు - china omicron news

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఫ్రాన్స్​లో లక్ష కేసులు నిర్ధరణ అయ్యాయి. ఆ దేశంలో ఒక రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. అమెరికా, రష్యా, సింగపూర్ దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంది.

world covid cases
world covid cases
author img

By

Published : Dec 26, 2021, 9:08 AM IST

Updated : Dec 26, 2021, 11:43 AM IST

World covid case: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఈ వైరస్​ రకానికున్న వ్యాప్తి రేటు వల్ల రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి.

France Covid cases

ఫ్రాన్స్​లో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి పాజిటివ్​గా తేలినట్లు ఫ్రాన్స్ శానిటరీ అథారిటీ వెల్లడించింది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం.

దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్య శాఖ మంత్రి ఒలీవర్ వెరన్ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఒమిక్రాన్ కేసులే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఆంక్షలు కఠినతరం చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

US covid news

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 40 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. 108 మంది మరణించారు.

క్రిస్మస్ హాలీడే సీజన్ కావడం, సిబ్బంది సంఖ్య తగ్గడం, కరోనా నిబంధనల కారణంగా అమెరికాలో పలు విమానాలు రద్దయ్యాయి. సుమారు వెయ్యి విమానాలు రద్దు అయినట్లు ఫ్లైట్అవేర్ అనే సంస్థ వెల్లడించింది. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. విమానాశ్రయాల్లో గందరగోళం నెలకొంది.

Singapore Omicron cases

సింగపూర్​లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం 98 కొత్త ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 448కి చేరింది. ఇందులో 369 కేసులు విదేశాల నుంచి వచ్చినవేనని అధికారులు తెలిపారు. వీటితో పాటు 248 సాధారణ కరోనా కేసులు నమోదయ్యాయి. ఓ మరణం సంభవించింది.

చైనాలో మళ్లీ...

చైనాలో కరోనా కేసులు ఆకస్మిక పెరుగుదల నమోదు చేశాయి. కొత్తగా 206 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయని చైనా హెల్త్ కమిషన్ వెల్లడించింది. ఇందులో స్థానికంగా బయటపడ్డ కేసులు 157 ఉన్నాయని వివరించింది. బీజింగ్ వింటర్ ఒలింపిక్స్​కు ముందు కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో రెండు వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1,01,077గా నమోదైంది. మరణాల సంఖ్య 4,636గా ఉంది.

ఇప్పటికే చైనాలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. డిసెంబర్ 13న తియాజిన్ నగరంలో తొలి కేసు బయటపడింది. అనంతరం మరికొన్ని నిర్ధరణ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఎన్ని ఒమిక్రాన్ కేసులు ఉన్నాయనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.

ఇటలీలో 54 వేలు

ఇటలీలోనూ కరోనా తీవ్రంగానే ఉంది. కొత్తగా 54,762కేసులు బయటపడ్డాయి. 144 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 56 లక్షలు దాటింది.

రష్యాలో 981 మరణాలు

రష్యాలో మరణాలు గణనీయంగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రతకు మరో 981 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 25 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం మరణాల సంఖ్య 303,250కు చేరుకుంది.

ఇదీ చదవండి: Omicron Scare: సింగిల్​ లేయర్ మాస్క్​ మంచిదేనా?

Last Updated : Dec 26, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.