ETV Bharat / international

సామ్​సంగ్ చొరవతో నట్టింట్లోకి కళాఖండాలు - వినూత్న ప్రయత్నం

ఇప్పటివరకు బెల్జియమ్​ ప్రఖ్యాత చిత్రకారుల కళాఖండాలను మ్యూజియంలో మాత్రమే చూడటానికి వీలుండేది. కానీ ప్రముఖ ఎలక్ట్రానిక్​ దిగ్గజం సామ్​సంగ్​ భాగస్వామ్యంతో ఇప్పుడు మీ ఇంట్లోనే చిత్రపటా​లను చూడొచ్చు.

సామ్​సంగ్ చొరవతో నట్టింట్లోకి కళాఖండాలు
author img

By

Published : Aug 28, 2019, 1:30 PM IST

Updated : Sep 28, 2019, 2:29 PM IST

సామ్​సంగ్ చొరవతో నట్టింట్లోకి కళాఖండాలు

బెల్జియమ్​ రాజధాని బ్రెసెల్స్​లోని రాయల్​ మ్యూజియమ్​ ఆఫ్​ ఫైన్​ ఆర్ట్స్​ చారిత్రక పెయింటింగ్​లకు నెలవు. ఒక్కసారి గ్రాండ్​రూమ్​లో ప్రవేశిస్తే 15వ శతాబ్దం నాటి ప్రముఖ చిత్రకారుల కళాఖండాలు మిమ్మల్ని ఆబ్బురపరుస్తాయి. ఇందులో ప్రధానంగా ప్రఖ్యాతి చిత్రకారుడు పీటర్​ బ్రూగెల్​ 1562లో రూపొందించిన 'ది ఫాల్​ ఆఫ్​ ద రెబల్​ ఏంజల్స్​' పెయింటింగ్​ ఈ తరానికి దర్శనమిస్తోంది. వాటిని చూస్తే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ కుదరని పని. ఇదంతా నిన్నటివరకు.

ఇప్పుడు మీకు నచ్చిన పెయింటింగ్స్​ను మీ లివింగ్​ రూమ్​లో దర్జాగా పెట్టుకొని చూడచ్చు. ప్రముఖ ఎలక్ట్రానిక్​ దిగ్గజం సామ్​సంగ్​ ఇందుకు కృషి చేస్తోంది. మ్యూజియంతో జరిగిన ఒప్పందంలో భాగంగా 22 ప్రముఖ చిత్రపటాలు టీవీలో పొందుపరిచారు. ఆర్ట్స్​ స్టోర్​ ఐచ్ఛికం ద్వారా వాటిని వీక్షించవచ్చు.

"టీవీలో వీక్షించడానికి సబ్​స్క్రిప్షన్​ పద్దతిలో పెయింటింగ్స్ అందుబాటులో ఉంటాయి. నెలకు ఐదు యూరోలు చెల్లిస్తే పరిమితం లేకుండా అన్ని చిత్రాలను చూడొచ్చు. దాదాపు 12వందల ప్రఖ్యాత కళాచిత్రాలు టీవీలో పొందుపరిచి ఉంటాయి. ఇంకో ఐచ్ఛికంలో ఒక్కో చిత్రానికి ప్రత్యేకంగా చెల్లించవచ్చు. ఇందుకు 20 యూరోలు ఖర్చవుతుంది."

-జాన్​ వాన్​, సామ్​సంగ్​ లైఫ్​స్టైల్​ ప్రాజెక్ట్​ మేనేజర్​.

సామ్​సంగ్​ ఇంతకుముందే ఇలాంటి కార్యక్రమాలు ఇతర దేశాల్లో చేపట్టింది. లండన్​ టేట్​ గ్యాలరీ, ప్లోరెన్స్​లోని ఉఫ్పీజీ మ్యూజియం, ఆమ్​స్టర్​డామ్ వాన్​ గోఘ్​ మ్యూజియంలలో సాంకేతికను జోడించింది.

టీవీలో ప్రధానంగా చిత్రాన్ని పెద్దదిగా చేసుకొని చూసే సదుపాయాన్ని కల్పించారు. సామ్​సంగ్​ ప్రదర్శించబోయే చిత్రాల్లో 1566 నాటి 'సెన్సెస్​ అట్​ బెత్లబమ్​' పెయింటింగ్​ ఆకట్టుకుంటుంది.

"మేము సామ్​సంగ్​ కంపెనీతో ముందుకెళ్లాలనుకుంటున్నాము. ప్రస్తుత సాంకేతికత కారణంగా ఈ చిత్రకళను త్వరగా విస్తరించొచ్చనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాము. సామ్​సంగ్​ టీవీలో మీరు ఇంట్లోనే ఈ కళాకృతులను చూడొచ్చు. ఇలా వాటిని చూశాక మ్యూజియమ్​లో ఉన్న అసలైన చిత్రాలను చూడటానికి వస్తారని ఆశిస్తున్నాము."

-ఇసాబెల్లి వాన్​హొనాకర్​, మ్యూజియమ్​ మేనేజింగ్​ డైరక్టర్​

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మ్యూజియాలన్నీ టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయి. కానీ బెల్జియం మ్యూజియం ఇప్పటివరకు సాంకేతికతను అందిపుచ్చుకోలేదు. ఈ నేపథ్యంలో మొదటిసారి సామ్​సంగ్​ భాగస్వామ్యంతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు మ్యూజియం నిర్వాహకులు తెలిపారు.

ఇలా సాంకేతికత సాయంతో ప్రజలకు చారిత్రక కళాఖండాలను దగ్గర చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.

Mumbai, Aug 28 (ANI): Bollywood actor Ayushmann Khurrana and Nushrat Bharucha shot a song for their upcoming film 'Dream Girl'. The song 'Dhagala Lagali' is full of energy. It's a Marathi song with rain dance sequence shot in backdrop of Ganesh Chaturthi celebration. Ayushmann and Nushrat were seen in a colourful traditional Marathi outfit in the song. With Ganesh Chaturathi festivities approaching, this song is a perfect festive track. Speaking to mediapersons, Ayushmann said, "For me, it's very different because my films don't have such songs. They are very realistic. Here I am doing everything that I have never done before."
Last Updated : Sep 28, 2019, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.