ETV Bharat / international

'కొన్నేళ్లల్లో కరోనా పుట్టుకపై క్లారిటీ' - చైనా కరోనావైరస్ ఆవిర్భావం

కరోనా పుట్టుక గురించి కొద్ది సంవత్సరాల్లోనే వాస్తవాలు తెలుస్తాయని చైనా వుహాన్​లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ నిపుణులు తెలిపారు. వణ్యప్రాణుల వర్తకమే వుహాన్​లో కరోనా వెలుగులోకి రావడానికి కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు.

Expert says origins of pandemic could be known in few years
'కరోనా ఆవిర్భావంపై కొద్ది సంవత్సరాల్లోనే స్పష్టత'
author img

By

Published : Mar 11, 2021, 6:26 AM IST

కరోనా వైరస్ మహమ్మారి పుట్టుక గురించి అంతర్జాతీయ సమాజానికి మరికొద్ది సంవత్సరాల్లోనే వాస్తవాలు తెలుస్తాయని వుహాన్​లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం సభ్యుడు పీటర్ డస్జాక్ వెల్లడించారు. జంతువుల నుంచి తొలిసారి మనుషులకు కరోనా సోకిన విషయాన్ని సంయుక్త పరిశోధనల ద్వారా గుర్తించవచ్చని తెలిపారు. వుహాన్​లో కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం వణ్యప్రాణుల వర్తకమే(మార్కెట్​లో జంతువుల అమ్మకం) అయి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. డబ్ల్యూహెచ్ఓతో పాటు చైనా సైతం ఇదే విషయాన్ని బలంగా నమ్ముతోందని అన్నారు.

"వచ్చే కొద్ది సంవత్సరాల్లోనే దీన్ని కనుగొంటామని మాకు నమ్మకం ఉంది. కరోనావైరస్ పుట్టుకపై వాస్తవ సమాచారం తెలుస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉద్భవించిందనే వివరాలన్నీ తెలుస్తాయి."

-పీటర్ డస్జాక్, డబ్ల్యూహెచ్ఓ బృందం సభ్యుడు.

కరోనా ఆవిర్భావంపై వ్యక్తమైన అనుమానాలన్నింటినీ తాము పరిగణలోకి తీసుకున్నామని వుహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ బృందంలోని సభ్యురాలు మారియోన్ కూప్​మన్స్ తెలిపారు. ల్యాబొరేటరీ ప్రమాదం వల్ల వైరస్ లీకైందన్న వాదననూ పరిశీలించామని చెప్పారు. వుహాన్​లోని జంతు మార్కెట్ సమీపంలో ఉన్న మూడు ల్యాబ్​లను సందర్శించినట్లు వెల్లడించారు. వారి పరిశోధనలు, పరీక్షలు, ప్రొటోకాల్స్​ను పరిశీలించి.. వైరస్ అక్కడి నుంచి బయటకు రాలేదని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు స్పష్టం చేశారు.

కాగా, డబ్ల్యూహెచ్ఓ బృందం వుహాన్ పర్యటనపై ప్రాథమిక వివరాలను వచ్చే వారం విడుదల చేయనున్నారు.

ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్​ఓకు చుక్కలు చూపించిన చైనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.