చైనాలో తగ్గుముఖం పట్టిన భయంకర మహమ్మారి కొవిడ్-19 ప్రస్తుతం ఐరోపాలో విస్తరిస్తోంది. ఇటలీ సహా పలు ఐరోపా దేశాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఐరోపా ఇప్పుడు ఈ వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిందని ప్రకటించింది.
ఈ మేరకు వర్చువల్ విలేకరుల సమావేశం నిర్వహించిన డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఈ ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ ధాటికి 5 వేల మంది మరణించడాన్ని 'విషాదకరమైన మైలురాయి'గా అభివర్ణించారు.
"చైనా మినహా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులతో పోలిస్తే ఐరోపాలోనే ఇప్పుడు అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. చైనాలో తీవ్ర స్థాయిలో ఉన్నప్పుటి కంటే ఐరోపాలో ఇప్పుడు అధిక కేసులు నమోదు అవుతున్నాయి. పరీక్షలు నిర్వహించడం, వ్యాప్తిని పసిగట్టడం, నిర్బంధించడం మాత్రమే కాదు. వీటన్నింటినీ సంయుక్తంగా నిర్వహించాలి. ఇదే ప్రపంచ దేశాలకు మేమిచ్చే సందేశం."-టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
ఇదీ చదవండి: భారత్‌లో రెండో కరోనా మరణం