ETV Bharat / international

ట్రంప్​ ప్రకటనతో ఈయూలో ఆర్థిక సంక్షోభం!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఐరోపాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రయాణ నిషేధం విధించిన నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు ఈయూ​ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్. ట్రంప్ నిర్ణయం కారణంగా తలెత్తే ఆర్థిక సంక్షోభంపై సభ్య దేశాలు జాగ్రత్త వహించాలన్నారు.

EU warns against 'economic disruption' after Trump Europe travel ban
ట్రంప్​ ప్రకటనతో ఈయూలో ఆర్థిక సంక్షోభం!
author img

By

Published : Mar 12, 2020, 4:38 PM IST

అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటన కారణంగా వచ్చే ఆర్థిక సంక్షోభంపై సభ్యదేశాలను హెచ్చరించారు యూరోపియన్​ కౌన్సిల్​ అధ్యక్షుడు చార్లెస్ మైకేల్. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఐరోపా నుంచి ఎవరూ అమెరికాకు రాకుండా ఇటీవల ప్రయాణ నిషేధం విధించారు ​ట్రంప్.

కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపథ్యంలో 30 రోజులపాటు ఐరోపాకు అమెరికా ప్రజల రాకపోకలను నిషేధించారు ట్రంప్. అధ్యక్షుడి నిర్ణయం కారణంగా ఐరోపాలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభ పరిస్థితులను తప్పించుకునేందుకు యత్నించాలని కోరారు ఐరోపా సమాఖ్య అధ్యక్షుడు చార్లెస్ మైకేల్. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు.

"అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రయాణ ఆంక్షల అనంతర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను ఐరోపా సమాఖ్య తీసుకుంటోంది. బాధితుల సంఖ్య తగ్గించేందుకు, వ్యాధి నియంత్రణపై పరిశోధన సాగించేందుకు చర్యలు తీసుకున్నాం."

-చార్లెస్ మైకేల్, ఈయూ అధ్యక్షుడు

ఐరోపాలో కరోనా కారణంగా ఇప్పటివరకు 711 మరణాలు సంభవించాయి. 17 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో సగం ఇటలీలోనే ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇరాన్​పై ట్రంప్​ దూకుడుకు కాంగ్రెస్​ కళ్లెం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.