ETV Bharat / international

రష్యాపై ఈయూ ఆంక్షలు.. పుతిన్ సాయం కోరిన ఉక్రెయిన్ రెబల్స్

EU sanctions on Russia: ఉక్రెయిన్​లోని రెండు వేర్పాటువాద ప్రాంతాలకు స్వతంత్రత కల్పించడం వల్ల రష్యా లక్ష్యంగా ఆంక్షలు విధించాయి ఈయూ దేశాలు. మరోవైపు రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ఆందోళ వ్యక్తం చేసింది. ఐరాస సభ్య దేశాలు చర్చలు జరిపాలని.. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని ఐరాస కోరింది.

EU sanctions on Russia
రష్యాపై ఈయూ ఆంక్షలు
author img

By

Published : Feb 24, 2022, 5:38 AM IST

Updated : Feb 24, 2022, 6:45 AM IST

EU sanctions on Russia: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే తాజాగా రష్యాలోని అధికారులు, చట్టసభ్యులు, పలు సంస్థలపై ఆంక్షలు విధించింది యూరోపియన్ యూనియన్.

"ఉక్రెయిన్​లోని రెండు ప్రాంతాలకు స్వతంత్రత ప్రకటించడంలో సహకరించిన రష్యా పార్లమెంటులోని 351 మంది సభ్యులపై యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. వీరితో పాటు 27 మంది ప్రముఖ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకులు, వ్యాపారవేత్తలు, మిలిటరీ అధికారులపైనా ఆంక్షలు వర్తిస్తాయి." అని యూరోపియన్ యూనియన్ విడుదల చేసిన ప్రకటనలో వెలువరించింది.

ఆందోళనలో ఐరాస

UN concern Russia: రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐరాస సభ్య దేశాలు చర్చలు జరిపాలని.. ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరింది. ఈ మేరకు రష్యా చర్యలను ఆందోళనకరమైనవిగా అభివర్ణించారు ఐరాస జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్.

ఉక్రెయిన్​లో ఎమర్జెన్సీ..

emergency in ukraine: ఉక్రెయిన్​లో అత్యవసర పరిస్థితి విధించేందుకు ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 24 నుంచి 30 రోజులపాటు అత్యవసర పరిస్థితి అమల్లోకి రానుంది. ఎమర్జెన్సీ సమయంలో ర్యాలీలు, ప్రచారాలు, సమావేశాలు, సభలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

బైడెన్​ కీలక ఆదేశాలు..

biden on russia: ఉక్రెయిన్​ రష్యా సరిహద్దులో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రష్యాకు చెందిన నార్డ్​స్ట్రీమ్​-2 గ్యాస్​ సరఫరాపై ఆంక్షలు విధించాలని అధికారులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీచేశారు. ఉక్రయిన్​ సరిహద్దులో మోహరించిన రష్యా బలగాలను వెనక్కుతీసుకోకపోతే మున్ముందు మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు బైడెన్.

రష్యా సైన్యం సాయం కావాలి..

russia ukraine crisis: మరోవైపు ఉక్రెయిన్​ను ఎదుర్కొనేందుకు సైనిక బలగాల సాయం కావాలని ఉక్రెయిన్​లోని వేర్పాటువాదులు తమను కోరినట్లు రష్యా తెలిపింది. ఈ మేరకు వేర్పాటువాదులు రష్యా అధ్యక్షుడు పుతిన్​కు లేఖ రాసినట్లు రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్​కోవ్ తెలిపారు. ఉక్రెయిన్​ మిలిటరీ దాడుల కారణంగా డాన్​బాస్ ప్రాంతంలోని పౌరులు మరణిస్తున్నారని, చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారని లేఖలో పేర్కొన్నట్లు వివరించారు.

ఇవీ చూడండి:

ఉక్రెయిన్​లో ఎమర్జెన్సీ- రష్యాపై మరిన్ని దేశాల ఆంక్షలు

ఏ క్షణమైనా ఉక్రెయిన్​పై అటాక్​.. వారంతా వెనక్కి రావాలని రష్యా ఆదేశం!

Last Updated : Feb 24, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.