ETV Bharat / international

ఏడాది చివరి నాటికి రెండు టీకాలకు అనుమతులు! - ఫైజర్​, మెటర్నా టీకాలకు త్వరలోనే అనుమతులు

ఏడాది చివరి నాటికి రెండు కొవిడ్ వ్యాక్సిన్​లకు షరతులతో కూడిన అనుమతులు లభించొచ్చని ఐరోపా సమాఖ్య(ఈయూ)కు చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఏ సమస్య లేకుండా అన్ని ప్రక్రియలు పూర్తయితే.. ఫైజర్​, మొడెర్నా టీకాలకు యురోపియన్ మెడిసిన్ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతి ఇవ్వొచ్చని తెలిపారు.

European Medicines Agency to Approve two Covid Vaccines soon
కొవిడ్ వ్యాక్సిన్​పై ఈయూ కీలక ప్రకటన
author img

By

Published : Nov 20, 2020, 11:37 AM IST

డిసెంబర్ చివరి నాటికి రెండు కొవిడ్ 19 వ్యాక్సిన్​లు.. షరతులతో కూడిన మార్కెట్ గుర్తింపు పొందొచ్చని యూరోపియన్ కమిషన్​ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డేర్ లియెన్ తెలిపారు.

'ఏ సమస్య లేకుండా అన్ని ప్రక్రియలు పూర్తయితే.. మొడెర్నా, ఫైజర్​లు.. జర్మనీకి చెందిన ఔషధ సంస్థ బయోఎన్​టెక్​ ద్వారా అభివృద్ధి చెందిన కొవిడ్ టీకాకు యురోపియన్ మెడిసిన్ ఏజెన్సీ (ఈఎంఏ) అనుమతి ఇవ్వొచ్చు.' అని పేర్కొన్నారు వాన్ డేర్ లియెన్.

వ్యాక్సిన్​పై సమకాలీన మదింపునకు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్​ (ఎఫ్​డీఏ)తో ఈఎంఏ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు.

మిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఐరోపా సమాఖ్య.. బయోఎన్​టెక్, ఫైజర్​లతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. మొడెర్నాతోనూ త్వరలో ఒప్పందం ఖరారు కానున్నట్లు వాన్ డేర్ లియెన్ ఈ వారం మొదట్లో ప్రకటించారు.

ఇదీ చూడండి:చైనాలో 10 లక్షల మందికి కరోనా టీకా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.