ETV Bharat / international

'ఈయూ సభ్యులారా! సీఏఏపై పూర్తి వాస్తవాలు తెలుసుకోండి' - ఈయూ తీర్మానం

పౌరసత్వ సవరణ చట్టంపై ఐరోపా సమాఖ్య పార్లమెంట్​లో తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈ చట్టం పూర్తిగా భారత అంతర్గత విషయమేనని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. భారత ప్రభుత్వాన్ని సంప్రదించి పూర్తి వాస్తవాలు తెలుసుకోవాలని ఈయూ సభ్యులకు హితవు పలికాయి. చట్టం పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా రూపొందించినట్లు స్పష్టం చేశాయి.

EU lawmakers intending to move draft resolution on CAA
'ఈయూ సభ్యులారా! సీఏఏపై పూర్తి వాస్తవాలు తెలుసుకోండి'
author img

By

Published : Jan 27, 2020, 6:19 PM IST

Updated : Feb 28, 2020, 4:13 AM IST

భారత్​లో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ చట్టంపై తమ పార్లమెంట్​లో తీర్మానాన్ని ప్రతిపాదించడానికి ఐరోపా సమాఖ్య ప్రతినిధులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ అంశం సహా పౌరసత్వ సవరణ చట్టంపై ఆరు పార్టీలు ఆరు వేర్వేరు తీర్మానాలను ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. బ్రసెల్స్​లో జనవరి 29న జరిగే సమావేశాల్లో దీనిపై చర్చించనున్నట్లు సమాచారం.

తీర్మానంలో ఏముంది?

అంతర్జాతీయ మానవహక్కుల నిబంధనలను భారత్ ఉల్లంఘించిందనే ఆరోపణలపై తాజా తీర్మానాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్-370 రద్దు అనంతరం జమ్ము కశ్మీర్​లో రాజకీయ నాయకుల గృహనిర్బంధం, సమాచార వ్యాప్తిపై ఆంక్షలు వంటి అంశాలపైనా చర్చించనున్నట్లు సమాచారం. ఉత్తర్​ప్రదేశ్​లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై పోలీసుల కాల్పులు సహా నిర్బంధించి హింసించారని తీర్మానంలో పార్లమెంట్ సభ్యులు ఆరోపించారు. జాతీయ పౌర పట్టిక అమలు ద్వారా ప్రపంచంలో స్థిర నివాసం లేనివారి సంక్షోభానికి కారణమవుతుందని తీర్మానంలో పేర్కొన్నారు.

భారత్​లో సీఏఏ వ్యతిరేక నిరసనకారులపై ప్రభుత్వం చేపడుతోన్న చర్యలు వారి ప్రాణాలకు ముప్పుగా మారాయని తీర్మానంలో ఆరోపించారు ఈయూ పార్లమెంట్ సభ్యులు. నిరసనకారులతో చర్చించాలని ప్రధాని మోదీకి సూచించారు. కశ్మీర్​లో ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. అంతర్జాతీయ బాధ్యతగా... సమానత్వాన్ని, అవివక్షతలను పాటిస్తూ సీఏఏను పునఃసమీక్షించాలని తీర్మానంలో స్పష్టం చేశారు.

భారత్ స్పందన

ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటు చేసినన చట్టానికి చెందిన హక్కులు, అధికారాలను తోటి ప్రజాస్వామ్య దేశాలుగా ప్రశ్నించకూడదని భారత ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారికంగా స్పందించనప్పటికీ... సీఏఏ పూర్తిగా దేశ అంతర్గత విషయమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తీర్మానాన్ని ప్రతిపాదించే ముందు చట్టానికి సంబంధించి పూర్తి వాస్తవాలను తెలుసుకోవాలని, చట్టంపై అవగాహన కోసం భారత ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఈయూ సభ్యులకు సూచిస్తున్నారు.

"ఈయూ పార్లమెంట్​కు చెందిన కొంతమంది సభ్యులు సీఏఏపై ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాలనుకుంటున్నట్లు తెలిసింది. సీఏఏ పూర్తిగా భారతదేశ అంతర్గత విషయం. అంతకుమించి... పార్లమెంట్​లో చర్చలు నిర్వహించిన తర్వాత పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ చట్టం రూపొందించాం. సహజత్వానికి మార్గనిర్దేశనం చేసే సమాజం... సందర్భాన్ని, ప్రమాణాలను రెండింటినీ పరిశీలిస్తుంది. ఇది వివక్ష కాదు. నిజానికి ఐరోపా సమాజాలు కూడా ఇదే వైఖరి అవలంబించాయి. తీర్మానానికి మద్దతిచ్చేవారందరూ మమ్మల్ని సంప్రదించి పూర్తి వాస్తవాలు తెలుసుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాం."
-అధికారిక వర్గాలు

భారత్-ఈయూ సదస్సుపై ప్రభావం

ప్రస్తుత పరిణామాలు మార్చి 13న భారత్-ఈయూ మధ్య జరిగే సదస్సుపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. బ్రసెల్స్​లో జరిగే సదస్సులో మోదీ పాల్గొననుండగా.. ఈ తీర్మానాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈయూకు ఫ్రాన్స్​ ఝలక్​!

ఈయూలో భాగస్వామి అయిన ఫ్రాన్స్.... సీఏఏపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం... భారత దేశ అంతర్గత రాజకీయ వ్యవహారమని తేల్చిచెప్పింది.

ZCZC
PRI DSB ESPL NAT
.NEWDELHI DES18
KEJRIWAL-ROADSHOW
Press broom button so hard that AAP breaks its 2015 record: Kejriwal
         New Delhi, Jan 27 (PTI) Delhi Chief Minister Arvind Kejriwal on Monday urged his supporters to press the button for broom, AAP's election symbol, on the EVM machine so hard that the party breaks its 2015 record of winning 67 assembly seats.
          Surrounded by scores of supporters,the AAP national convenor took out a roadshow in north Delhi's Narela and Bawana areas.
          "Press the broom button so hard that we will break the record of 2015," Kejriwal said.
          He also thanked the people for coming for the roadshow despite the cold weather and light rain.
          Kejriwal, atop an open navy blue jeep, waved to the public and shook hands with people as his roadshow moved through the narrow lanes.
         He was accompanied by Sharad Chauhan and Ram Chander, the MLAs of Narela and Bawana, respectively.
         Holding placards in support of various schemes of the government, including free healthcare, and electricity, AAP supporters danced to the tune of 'Lage Raho Kejriwal' (the party's anthem).
          In the assembly polls five years ago, the AAP secured a thumping victory as the party bagged 67 seats, leaving just three for the BJP. PTI UZM
         
AAR
01271614
NNNN
Last Updated : Feb 28, 2020, 4:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.