కరోనా మహమ్మారిని నిలువరించేందుకు పెద్దఎత్తున టీకాలు కొనుగోలు చేయాలని ఐరోపా సమాఖ్య నిర్ణయించింది. 2023 నాటికి 1.8 బిలియన్ టీకా డోసులను సరఫరా చేసేలా ఫైజర్-బయోఎన్‌టెక్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
నూతన ఒప్పందం ప్రకారం.. సభ్య దేశాలకు అందించే వ్యాక్సిన్ల ఉత్పత్తికి అవసరమైన వనరులను ఫైజర్ సంస్థకు ఐరోపా సమాఖ్య సమకూర్చనుంది.
ఈ మేరకు.. 900 మిలియన్ డోసుల టీకాలు కచ్చితంగా సరఫరా చేసేలా ఫైజర్‌తో ఒప్పందం ఖరారైనట్లు ఈయూ అధ్యక్షుడు ఉర్సులా ఓన్ లియెన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఇప్పటికే కనీసం అర డజను కంపెనీల నుంచి 2.3 బిలియన్ డోసులను పొందేలా ఐరోపా కమిషన్ ప్రణాళికలు వేసింది. ఈ క్రమంలో ఇతర ఒప్పందాలు, టీకా సాంకేతికతలనూ పరిశీలించనున్నట్లు ఈయూ అధ్యక్షుడు ట్విట్టర్లో తెలిపారు.
ఇవీ చదవండి: 'భారత్-ఈయూ చర్చలతో వాణిజ్యం బలోపేతం'