ETV Bharat / entertainment

'దేవర'​ రన్​టైమ్​లో 8 నిమిషాలు ట్రిమ్‌! - సినిమా నిడివి ఎంతంటే? - Devara Movie RunTime - DEVARA MOVIE RUNTIME

Devara Movie RunTime : ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన పాన్‌ ఇండియా మూవీ 'దేవర'. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడీ సినిమా నిడివిలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఇంతకీ సినిమా రన్ టైమ్​ ఎంతంటే?

source PTI
Devara Movie RunTime (source PTI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 6:25 AM IST

Devara Movie RunTime : యంగ్ టైగర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర రాకకు మరో రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. సెప్టెంబర్ 27 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఇప్పుడీ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మూవీ నిడివిలో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలిసింది. దాదాపు ఎనిమిది ట్రిమ్‌ అయిందట. దీంతో 170.58 నిమిషాల (2: 50 గంటలు) రన్‌ టైమ్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సురక్షిత ప్రయాణ సందేశం, ధూమపానం హెచ్చరికలు లాంటివి మినహాయిస్తే మొత్తం సినిమా లెంగ్త్‌ 2:42 గంటలు. ఈ సినిమా నిడివి అంతకుముందు 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉంది.

Devara Movie Records : కాగా, ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను కూడా నెలకొల్పింది. ఓవర్సీస్​లో ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరుకున్న ఈ చిత్రం, రీసెంట్​గానే రెండు మిలియన్‌ డాలర్ల మార్క్‌ను కూడా చేరుకుంది. రిలీజ్‌కు మరో రెండు రోజులు ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అభిమానులు భావిస్తున్నారు. లాస్‌ ఏంజెల్స్‌లో జరగనున్ను బియాండ్‌ ఫెస్ట్‌లో ప్రదర్శితం కానున్న మొదటి భారతీయ చిత్రం దేవరనే కావడం విశేషం. ఇంకా ఈ సినిమా అదనపు షోలు, టికెట్‌ ధరల పెంపునకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో మూవీ టీమ్​ హర్షం వ్యక్తం చేసింది.

Devara Janhvi Kapoor : బాలీవుడ్‌ హీరోయిన్​ జాన్వీ కపూర్‌ ఈ సినిమాతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇవ్వనుంది. స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ విలన్​గా కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. చూడాలి మరి ఇప్పటికే పలు రికార్డులను అందుకున్న ఈ చిత్రం రిలీజ్ తర్వాత ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో.

'దేవర'లో తారక్​ది డ్యుయెల్ రోల్​ లేదా ట్రిపుల్​ రోల్​? - క్లారిటీ ఇచ్చిన రత్నవేలు - NTR Triple Role Devara

చిరంజీవితో మనస్పర్థలు - అసలు విషయం చెప్పేసిన కొరటాల! - Devara Korata Siva Chiranjeevi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.