NTR Triple Role In Devara : మరో రెండు రోజుల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది 'దేవర'. గురువారం అర్ధరాత్రి నుంచే షోలు పడనున్నాయి. మంచి హైప్ మధ్య రిలీజ్ అవుతున్న ఈ మూవీ కథ గురించి, సినిమాలోని పాత్రల గురించి సోషల్ మీడియాలో ప్రతి రోజు రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ట్రైలర్ చూడగానే కథ ఇదేనంటూ రకరకాల థియరీస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఉండే ట్విస్టుల గురించి కూడా నెట్టింట్లో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ దేవరలో తారక్ ద్విపాత్రాభినయం చేశారని ముందు నుంచి అందరికీ తెలిసిందే. కానీ ఆ మధ్య మూడో పాత్ర కూడా ఉంటుందని, ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారని కొత్త ప్రచారం మొదలైంది. దీని గురించి ఊహాగానాలు బాగా పెరిగిపోవడంతో తాజాగా దేవర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పందించారు. ఈ చిత్రంలో తారక్ చేసినది ట్రిపుల్ రోల్ కాదని ఆయన పక్కాగా తేల్చేశారు.
"ఈ మూవీపై సోషల్ మీడియాలో చాలా రకరకాల ఊహాగానాలు తెగ షేర్ అవుతున్నాయి. యూట్యూబ్ చానళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు ఏది కావాలంటే అది చెప్పగలరు. ఇందులో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ చేశారని అంటున్నారు. అది నిజం కాదు. ఆయన ద్విపాత్రాభినయం మాత్రమే చేస్తున్నారు. ఆయన తండ్రీకొడుకుల పాత్రలో నటిస్తున్నారా, అన్నదమ్ములా అనే విషయాన్ని మాత్రం ఇప్పుడు నేను చెప్పను. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యాక ఆ విషయం మీకే తెలుస్తుంది" అని చెప్పుకొచ్చారు.
Devara Cinematographer Rathanvelu : రత్నవేలు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలతో దేవరలో తారక్‌ది ట్రిపుల్ రోల్ కాదని క్లారిటీ వచ్చేసింది. అంతకుముందు దేవర మూవీ కోసం తమ టీమ్ ఎంత కష్టపడిందో వివరిస్తూ రత్నవేలు ఓ పోస్ట్ కూడా పెట్టారు. 30 రోజుల పాటు నిద్రలేని రాత్రులు కూడా గడిపినట్లు వివరించారు. ఈ సినిమాకు కలర్ గ్రేడింగ్ చేసినట్లు వెల్లడించారు.
మరో ఇంటర్వ్యూలో దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ - "ఈ కథ రాసుకుంటున్నప్పుడే ఎన్టీఆర్‌ను తప్ప మరొకర్ని ఊహించుకోలేదు. ఆయన ఎప్పుడూ మాస్ హీరో. ఈ కథలోని తండ్రీకొడుకుల పాత్రల్ని ఎన్టీఆర్‌తోనే చేయించాలని ముందే నిర్ణయించుకున్నాం. దేవర పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తన కొడుకు వర పాత్ర అంతకు మించేలా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. కాబట్టి తారక్ తండ్రీకొడుకుల పాత్రల్ని చేస్తున్నట్లు స్పష్టత వచ్చేసింది.
'దేవర' రన్‌టైమ్‌లో 8 నిమిషాలు ట్రిమ్! - సినిమా నిడివి ఎంతంటే? - Devara Movie RunTime
చిరంజీవితో మనస్పర్థలు - అసలు విషయం చెప్పేసిన కొరటాల! - Devara Korata Siva Chiranjeevi