ETV Bharat / international

'ఆ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా టీకా సరఫరాకు దోహదం'

కొవిడ్​ మహమ్మారి టీకాను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు భారత్​ తీసుకున్న నిర్ణయం మార్గం సుగమం చేసిందని పేర్కొంది ఆస్ట్రాజెనెకా. 2021లో 300 కోట్ల డోసుల ఉత్పత్తికి అంతర్జాతీయంగా తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించింది. డబ్ల్యూహెచ్​ఓ అత్యవసర వినియోగ జాబితాలో తమ టీకాను చేర్చాలని కోరుతోంది.

Astrazeneca
ఆస్ట్రాజెనెకా
author img

By

Published : Jan 7, 2021, 5:13 AM IST

భారత్​లో కొవిడ్​-19 టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించటం కీలక మైలరాయిగా పేర్కొంది ప్రముఖ ఫార్మాసంస్థ ఆస్ట్రాజెనెకా. భారత్​ నిర్ణయం.. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్​ సరఫరాకు దోహదపడుతుందని తెలిపింది. తమ టీకా కోవిషీల్డ్​కు ఇప్పటి వరకు ఆరు దేశాలు అత్యవసర వినియోగనికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది ఆస్ట్రాజెనెకా. అందులో భారత్​తో పాటు అర్జెంటీనా, డొమినికా రిపబ్లిక్​, ఎల్​ సల్వడార్​, మెక్సికో, మొరోకోలు ఉన్నాయి.

తమ టీకా పూర్తిగా సురక్షితమని, కొవిడ్​-19ను సమర్థవంతంగా అడ్డుకుంటోందని క్లినికల్​ ట్రయల్స్​లో తేలినట్లు వెల్లడించింది ఫార్మా సంస్థ. రెండో డోస్​ వేసుకున్న తర్వాత 14 రోజులకు మించి ఆసుపత్రుల్లో ఉండటం లేదని తెలిపింది. 2021లో 300 కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ భాగస్వామ్య సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది.

" అత్యవసర వినియోగానికి ఆమోదం లభించటంతో త్వరలోనే లక్షలాది మందికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. అది ప్రపంచవ్యాప్తంగా అందరికి సమానంగా వ్యాక్సిన్​ అందించాలనే మా దీర్ఘకాల నిబద్ధతకు రుజువు. ఈ మహమ్మారిపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపుతుందనే నమ్మకం ఉంది. ఔషధ నియంత్రణ సంస్థలు టీకా అనుమతులపై త్వరగా, నిర్ణయాత్మకంగా చర్యలు చేపట్టినందుకు వారికి మా కృతజ్ఞతలు. అలాగే.. మా భాగస్వాములు, సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాల కృషికి అభినందనలు."

- పాస్కల్​ సోరియట్​, ఆస్ట్రాజెనెకా సీఈఓ

కీలక మైలురాయి..

భారత్​లో కరోనా వ్యాక్సిన్​ అత్యవసర వినియోగానికి అనుమతులు రావటం ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు సీరం ఇన్​స్టిట్యూట్​ సీఈఓ అదర్​ పూనావాలా. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రజలకు సురక్షితమైన, సరసమైన, రోగనిరోధకతను పెంచే వ్యాక్సిన్​ పొందేలా ప్రోత్సహించే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు.

ఐరోపా ఔషధ సంస్థ (ఈఎంఏ)కు అవసరమైన పత్రాలు సమర్పించామని, త్వరలోనే అక్కడా అనుమతులు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది ఆస్టాజెనెకా. అల్పాదాయ దేశాలకు వ్యాక్సిన్​ అందించే చర్యలు వేగవంతం చేసేందుకు గానూ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర వినియోగ జాబితాలో తమను కూడా చేర్చాలని కోరుతోంది సంస్థ.

ఇదీ చూడండి: ఆక్స్​ఫర్డ్​ టీకా జనవరి తొలివారంలో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.