ETV Bharat / international

104 రోజుల తర్వాత కిటకిటలాడిన ఈఫిల్​ టవర్​

ఫ్రాన్స్​లోని ఈఫిల్​ టవర్​ను 104రోజుల అనంతరం సందర్శనకు అనుమతినిచ్చారు. కరోనా సంక్షోభం దృష్ట్యా మూతపడ్డ ఈఫిల్​ టవర్​.. ఇప్పుడు పర్యటకులతో కిటకిటలాడుతోంది. అయితే భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. దీనితో పాటు కేవలం తొలి రెండు అంతస్తుల వరకే సందర్శకులను అనుమతిస్తున్నారు.

Eiffel Tower reopens after longest closure since WWII
104 రోజుల తర్వాత ఈఫిల్​ టవర్​ సందర్శనకు అనుమతి
author img

By

Published : Jun 26, 2020, 12:14 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్​ టవర్ సందర్శన​ను.. 104 రోజుల లాక్​డౌన్​ విరామం అనంతరం పునః ప్రారంభించారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఫ్రాన్స్​లోని ఈఫిల్ టవర్​ను ఇన్ని రోజుల పాటు మూసివేయడం ఇదే తొలిసారి.

ఈఫిల్​​ టవర్​లో సందర్శకులను అనుమతించిన తొలిరోజే.. పర్యటకులు, స్థానికులు తరలివచ్చారు. వీరికి ప్రవేశ ద్వారం వద్దే మస్కట్​, సంగీతంతో స్వాగతం లభించింది.

104 రోజుల తర్వాత ఈఫిల్​ టవర్​ సందర్శనకు అనుమతి

రెండు అంతస్తుల్లో మాత్రమే..

324 మీటర్లు(1,063 అడుగులు) ఎత్తైన ఈ ఐరన్​ టవర్​ను వీక్షించేందుకు పరిమిత సంఖ్యలో పర్యటకులకు అవకాశం కల్పించారు అధికారులు. పైకి వెళ్లేందుకు ఎలివేటర్​ సేవలను నిలిపేసి.. మొదటి, రెండవ అంతస్తుల్లో మాత్రమే ప్రవేశం కల్పించారు.

వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో చిన్న పిల్లలకు ప్రవేశం నిషేధించిన సిబ్బంది.. 11ఏళ్లు పైబడిన వారికే అనుమతిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం నియమాలను పాటించేలా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: తుది దశకు ఆక్స్‌ఫర్డ్‌ టీకా- అక్టోబర్​లో రిలీజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.