Digital Map For Animal Lovers: మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు ఎక్కడికైనా వెళ్లి ఆనందంగా గడపాలని అనిపిస్తుంది. ఉల్లాసంగా గడపడానికి కొందరు దగ్గరిలోని పార్కులు, ఆలయాలకు వెళతారు. మరికొందరు పెంపుడు జంతువులతో ఆనందంగా గడపడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. పెంపుడు జంతువులు లేకపోయినా... కాసేపు మూగజీవాలతో గడపాలనుకునే వారికోసం జర్మనీ, బెర్లిన్ నగరానికి చెందిన అన్నా బెరెజ్కోవా అనే ఇంజినీర్ సరికొత్త మ్యాప్‌ను రూపొందించారు. ప్రత్యేకంగా గోట్ లవర్స్ కోసం ఈ మ్యాప్‌ను తీర్చిదిద్దారు. మొబైల్లో ఈ మ్యాప్ చూసుకుంటూ దగ్గర్లోని మేకల పాకలకు చేరుకోవచ్చు. అక్కడ వాటితో సరదాగా గడపొచ్చు. వాటికి ఆహారాన్ని అందిస్తూ ఆనందించొచ్చు.
"ఇంతపెద్ద నగరం గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. ఎక్కడెక్కడ మేకల పాకలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టం. ఒత్తిడిగా అనిపించినప్పుడు మ్యాప్ సహాయంతో అక్కడికి చేరుకుని ఉల్లాసంగా గడపవచ్చు."
-అన్నా బెరెజ్కోవా
Berlin Engineer Found New Map For Goat Shelters:
కొన్ని మేకల పార్కులకు వెళ్లాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలాంటివాటిని ఎరుపు రంగు మేక గుర్తుతో మ్యాప్‌లో పొందుపరిచారు అన్నా బెరెజ్కోవా. ఎలాంటి రుసుం లేని మేకల పాకలకు నల్లని మేక గుర్తును ఉపయోగించారు.
నగరంలో మొత్తంలో 24 మేకల పాకలను ఈ గుర్తులతో మ్యాప్‌లో పొందుపర్చారు బెరెజ్కోవా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి దీనిని తయారు చేసినట్లు తెలిపారు. ఈ మ్యాప్‌తో పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ ఉచితంగా వాడుకునేలా దీనిని తయారు చేశారు ఇంజినీర్ బెరెజ్కోవా.
"గత ఏడాది ఈ మ్యాప్‌ను 11 వేల మంది వీక్షించారు. ఎవరెవరు ఈ మ్యాప్‌ను సేవ్ చేసుకుని వాడుతున్నారో తెలియదు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాకు 600 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పేరుప్రతిష్ఠలు, డబ్బుల కోసం దీనిని తయారు చేయలేదు. "
-అన్నా బెరెజ్కోవా
Berlin Engineer Found New Map: ఈ మ్యాప్ పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. తాము పని ఒత్తిడి నుంచి బయటపడేందుకు లంచ్ సమయంలో లేదా పని ముగిసిన తర్వాత మేకల వద్దకు వస్తున్నట్లు చెప్పారు. మ్యాప్‌ను తయారు చేసిన ఇంజినీర్ అన్నా బెరెజ్కోవాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవవండి: