ETV Bharat / international

ఆ ఒక్కడి కోసమే విమానం ఎగిరింది! - 29 asylum seekers

ఒకే ఒక్క ప్రయాణికుడి కోసం విమానం బ్రిటన్​ నుంచి ఫ్రాన్స్​కు వెళ్లింది. ఇందుకోసం అయిన ఖర్చు లక్ష పౌండ్లకు పైనే. అయితే.. ఆ ఒక్కడి కోసం విమానం ఎందుకు నడపాల్సి వచ్చిందంటే..?

Deportation flight had one passenger
ఆ ఒక్కరి కోసమే విమానం ఎగిరింది!
author img

By

Published : Oct 3, 2020, 10:44 PM IST

ఒక్క వ్యక్తి కోసం ఏకంగా ఓ విమానమే నడిచిన ఘటన బ్రిటన్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ సమయంలో ప్రవాసీయులను తరలించేందుకు బ్రిటన్‌ హోమ్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేసిన ఈ విమానంలో నిజానికి 30 మంది వెళ్లాల్సి ఉంది. అయితే చివరి నిముషంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వటంతో 29 మంది ఆగిపోవాల్సి వచ్చింది. వారు బ్రిటన్‌ వదిలి వెళ్లకుండా ఉండేందుకు శరణార్థుల తరఫు న్యాయవాదులు చివరి క్షణం వరకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి తరఫున వివిధ న్యాయస్థానాల్లో పిటిషన్లు వేశారు.

ఈ ప్రవాసీయులు న్యాయస్థానంలో దాఖలు చేసిన కారణాలు అర్థంలేనివని.. అయినా వాటిని న్యాయస్థానం స్వీకరించిందని ఓ ఉన్నతాధికారి వాపోయారు. వారు దేశాన్ని వదిలి వెళ్లకుండా ఉండేందుకే విమానం బయలుదేరే చివరి నిముషంలో కోర్టుకు అప్పీలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. దీంతో మిగిలిన ఒక్క ప్రయాణికుడితో ఆ విమానం ఫ్రాన్స్‌కు బయలుదేరింది. అందులో ప్రయాణించింది సూడాన్‌కు చెందిన ఓ వ్యక్తి. కాగా, ఈ 'ఒకే ఒక్కడి' కోసం అయిన ఖర్చు 1,00,000 పౌండ్లు(దాదాపు రూ.94 లక్షలపైనే).

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.