ETV Bharat / international

'కరోనా కాలంలో ప్రజాస్వామ్య విలువలకు పాతర'

చాలా దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు మరుగున పడిపోతున్నట్లు ఓ అంతర్జాతీయ సంస్థ నివేదికలో (International IDEA) స్పష్టం చేసింది. కరోనా కట్టడి పేరుతో చాలా దేశాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది.

Democracy backsliding
ప్రజాస్వామ్య విలువలు
author img

By

Published : Nov 22, 2021, 6:30 PM IST

Updated : Nov 22, 2021, 8:31 PM IST

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం క్షీణదశకు చేరుకుందని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్(ఇంటర్నేషనల్​ ఐడియా) (International IDEA) తన నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు చాలా దేశాలు ఇప్పటికే అప్రజాస్వామిక, అనవసరమైన చర్యలను తీసుకుంటున్నాయని తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టు నాటికి కరోనా మహమ్మారిని (corona news) అరికట్టే దిశగా సుమారు 64 శాతం దేశాలు అనవసరమైన, చట్టవిరుద్ధమైన చర్యలను చేపట్టినట్లు ఇంటర్నేషనల్​ ఐడియా (International IDEA) పేర్కొంది. ప్రజాస్వామ్యం లేని దేశాల్లో కూడా పరిస్థితి మరింత దిగజారుతుందని స్వీడన్​కు చెంది ఈ సంస్థ స్పష్టం చేసింది. నిరంకుశ పాలనలతో ఆయా దేశాల్లో అణచివేత ధోరణి మరింత ఎక్కువైందని నివేదికలో పేర్కొంది. ఈ చర్యలతో వాక్ స్వాతంత్ర్యాన్ని పాలకులు కట్టడి చేశారని చెప్పుకొచ్చింది. అంతేగాకుండా చట్టాల ఉల్లంఘన కూడా మరింత ఎక్కువైనట్లు చెప్పింది.

దశాబ్ద కాలంలో అమెరికా, హంగేరీ, పోలాండ్, స్లోవేనియా వంటి దేశాల్లో ప్రజాస్వామ్య విలువలు కనిష్ఠానికి చేరుకున్నట్లు నివేదికలో ఇంటర్నేషనల్​ ఐడియా తెలిపింది. అయితే ఈ సమయంలోనే ప్రజాస్వామ్య దేశాలు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చింది. రేండేళ్లగా ప్రజాస్వామ్యం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆ సంస్థ సెక్రెటరీ జనరల్​ కెవిన్​ కాసస్​ జమోరా పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్య పాలన రూపంగా మారినప్పుడే నిజమైన విజయం సాధించినట్లని చెప్పారు.

ఇప్పటికే నాలుగు దేశాలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను కోల్పోయాని గుర్తు చేసిన ఈ నివేదిక లోపభూయిష్ట ఎన్నికలు, సైనిక తిరుగుబాట్లే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'డ్రాగన్​'ను ధిక్కరిస్తే.. నామరూపాలు లేకుండా పోవడం ఖాయం!

Last Updated : Nov 22, 2021, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.