ETV Bharat / international

Delta variant: అక్కడ పరిస్థితులు ఆందోళనకరం! - ఆందోళనకరంగా బ్రిటన్ వేరియంట్

బ్రిటన్​లో కరోనా డెల్టా వేరియంట్(బి.617) ఆందోళనకరంగా మారింది. వారంలో రోజుల్లోనే 5,472 మందికి ఈ వేరియంట్ సోకింది.

delta variant
కొవిడ్, డెల్టా వేరియంట్
author img

By

Published : Jun 4, 2021, 7:58 AM IST

భారత్​లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా(బి.1.617) వేరియంట్(Delta variant) ప్రస్తుతం బ్రిటన్​లోనూ ఆందోళనకర స్థాయికి చేరింది. వారం రోజుల్లోనే 5,472 మందికి ఈ వైరస్​ సోకగా మొత్తంగా కేసుల సంఖ్య 12,431కి చేరింది.

బ్రిటన్​ కెంట్​లో తొలుత వెలుగు చూసిన ప్రమాదకర ఆల్ఫా వేరియంట్​ కంటే డెల్టా అత్యంత ప్రమాదకరమని ఇంగ్లాండ్ పబ్లిక్ హెల్త్(పీహెచ్​ఈ) అధికారులు తెలిపారు. ఈ వేరియంట్ కారణంగా ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరగనుందని పేర్కొన్నారు.

"బ్రిటన్​లో ఆందోళనకరంగా మారిన డెల్టా వేరియంట్​ను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. ప్రతిఒక్కరు వీలైనంత త్వరగా వ్యాక్సిన్​ తీసుకోవడం మంచింది."

--డాక్టర్ జెన్నీ హారిస్, బ్రిటన్ ఆరోగ్య సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్.

డెల్టా వేరియంట్​ వైరస్​తో.. ఈ వారం 278 మంది, గత వారం 201 మంది ఆసుపత్రి పాలయ్యారని పీహెచ్​ఈ తెలిపింది. ఇందులో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని పేర్కొంది. బాల్టన్, బ్లాక్​బర్న్, డార్వెన్ ప్రాంతాల్లో ఈ వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:Delta Variant: డెల్టా వేరియంట్‌పై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.