ETV Bharat / international

తొలి రఫేల్​ యుద్ధ విమానానికై ఫ్రాన్స్​కు రక్షణమంత్రి

రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, ఎయిర్​ చీఫ్​ మార్షల్ బీఎస్​ ధనోవా వచ్చే నెలలో పారిస్​కు వెళ్లనున్నారు. డసో సంస్థతో కుదుర్చుకున్న 36 రఫేల్​ యుద్ధ విమానాల్లో భాగంగా తొలి విమానం వచ్చే నెలలో భారత అమ్ముల పొదిలో చేరనుంది.

తొలి రఫేల్​ యుద్ధ విమానానికై ఫ్రాన్స్​కు రక్షణమంత్రి
author img

By

Published : Aug 22, 2019, 6:49 AM IST

Updated : Sep 27, 2019, 8:29 PM IST

రఫేల్​ యుద్ధ విమానాల రాకకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలోనే భారత్​ అమ్ముల పొదిలోకి తొలి రఫేల్​ విమానం చేరనుంది. రక్షణ మంత్రి రాజ్​నాథ్​సింగ్​, ఎయిర్​ చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా సెప్టెంబర్​లో పారిస్​కు వెళ్లి ఈ విమానాన్ని స్వీకరించనున్నారు. సెప్టెంబర్​ 20న నిర్వహించే కార్యక్రమంలో ఉన్నతస్థాయి సైనికాధికారుతో పాటు, రఫేల్​ తయారీ సంస్థ డసో ఏవియేషన్​ అధికారులు కూడా హాజరుకానున్నారని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ కార్యక్రమంపై ఫ్రాన్స్​ అధికారులతో చర్చించేందుకు భారత వైమానిక దళానికి చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటికే పారిస్​ చేరుకుంది. అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుతో పాటు పైలట్లకు శిక్షణ పూర్తి చేసి రఫేల్​ యుద్ధవిమానాలకు స్వాగతం పలికేందుకు ఐఏఎఫ్​ సంసిద్ధంగా ఉంది.

2016లో ఒప్పందం..

రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్‌ నుంచి 36 అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్‌ 2016లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్‌ వినియోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్‌ విమానాల కన్నా ఆధునికమైనందున.. భారత వాయుసేన పైలట్లకు దీనిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా పైలట్లను ఫ్రాన్స్‌కు పంపి వచ్చే ఏడాది మే నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. భారత్‌కు అందే రఫేల్‌ విమానాల విషయంలో మరింత ఖర్చుతో మన దేశ పరిస్థితులకు తగ్గట్లుగా అదనపు ఫీచర్లను జోడిస్తున్నారు. రఫేల్‌ విమానాల స్క్వాడ్రన్‌లను హరియాణాలోని అంబాలా, బంగాల్‌లోని హషిమరా వైమానిక స్థావరాల్లో మొహరించే అవకాశం ఉందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

Intro:Body:Conclusion:
Last Updated : Sep 27, 2019, 8:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.