ETV Bharat / international

'కొవాగ్జిన్​ అత్యవసర అనుమతిపై సమీక్షిస్తున్నాం'

కొవాగ్జిన్ టీకాకు అత్యవసర అనుమతిపై సమీక్షిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం పూర్తయ్యిందని.. వారు సమర్పించిన సమగ్ర సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ వెల్లడించారు.

Covaxin
కొవాగ్జిన్
author img

By

Published : Jul 19, 2021, 11:35 PM IST

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ టీకాకు ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ (ఈయూఎల్​) కింద గుర్తింపు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం పూర్తయ్యిందని.. వారు సమర్పించిన సమగ్ర సమాచారాన్ని విశ్లేషిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్‌ డాక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ వెల్లడించారు.

ఇప్పటివరకు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, సినోవాక్‌తో పాటు సినోఫార్మ్‌ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చినట్లు ఆమె గుర్తుచేశారు. కొవాగ్జిన్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ జులై తొలివారంలోనే అందజేసిందని.. డబ్ల్యూహెచ్‌ఓ నిపుణుల బృందం ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తోందని చెప్పారు. ఇక డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలో ఏర్పాటైన 'కొవాక్స్‌' కార్యక్రమం ద్వారా భారత్‌కు 75 లక్షల మోడెర్నా డోసులు అందించనున్నట్లు తెలిపారు.

100 దేశాలకు వ్యాపించిన డెల్టా..

అత్యంత ఎక్కువ వ్యాప్తి కలిగిన డెల్టా వేరియంట్‌ ఇప్పటికే దాదాపు 100 దేశాలకు విస్తరించిందని డబ్ల్యూహెచ్‌ఓ ప్రాంతీయ డైరెక్టర్‌ పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ పేర్కొన్నారు. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాబల్యం కలిగిన వైరస్‌గా అవతరించనుందని అన్నారు. దీంతో పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అందుచేత వైరస్‌ కట్టడి చర్యలు సమర్థంగా చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాలకు పూనం ఖేత్రపాల్‌ సింగ్‌ పిలుపునిచ్చారు.

కొవాగ్జిన్‌ టీకాకు ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్‌ బయోటెక్‌ ఇదివరకే దరఖాస్తు చేసుకుంది. ఇందుకు అవసరమైన పత్రాలను సమర్పించింది. ప్రస్తుతం వాటిని విశ్లేస్తున్నడబ్ల్యూహెచ్​ఓ.. సెప్టెంబర్‌లోపు అనుమతి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అత్యవసర వినియోగానికి అర్హత సాధించిన తర్వాత వాటి ఫలితాలను విస్తృతంగా ప్రకటిస్తామని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

ఇదీ చదవండి: Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.