ETV Bharat / international

మనమే కాదు.. రష్యా నుంచి చమురు కొనే దేశాలు ఎన్నో.. - రష్యా ఉక్రెయిన్ యుద్ధం

CRUDE OIL FROM RUSSIA: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న భారత్​పై అమెరికా వంటి దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తక్కువ ధరకు వస్తుందని ఉక్రెయిన్​పై దురాక్రమణకు దిగిన దేశానికి మద్దతిస్తారా? అంటూ నిలదీస్తున్నాయి. ఘోరమైన నేరానికి పాల్పడినట్లుగా చిత్రిస్తున్నాయి. వాస్తవానికి రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల్లో చమురు సరఫరా అంశం లేదు. చమురు కొనుగోలు ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్నిభారత్ సమర్థిస్తుందని ఆక్షేపించారు. ఏయే దేశాలు రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నాయో తెలుసుకుందాం.

russia to import crued oil
రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న దేశాలు
author img

By

Published : Mar 20, 2022, 8:00 AM IST

Updated : Mar 20, 2022, 9:34 AM IST

CRUDE OIL FROM RUSSIA: ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న మన దేశంపై అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. తక్కువ ధరకు వస్తుందని దురాక్రమణకు దిగిన దేశానికి మద్దతిస్తారా? అంటూ నిలదీస్తున్నాయి. ఘోరమైన నేరానికి పాల్పడినట్లుగా చిత్రిస్తున్నాయి. వాస్తవానికి రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల్లో చమురు సరఫరా అంశం లేదు. అదే విషయాన్ని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్‌ సాకి ఒకవైపు అంగీకరిస్తూనే.. మరోవైపు చరిత్ర పుస్తకాల్లో భారత్‌ స్థానం ఎలా ఉండబోతుందో ఊహించుకోండి అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు. చమురు కొనుగోలు ద్వారా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యుద్ధాన్ని సమర్థిస్తున్నారని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి ఒక్క మనదేశమే ఇంధనాన్ని కొంటోందా? ఇంకెన్ని దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి? అనే విషయాన్ని పరిశీలిద్దాం.

బల్గేరియా: రష్యా నుంచి సరఫరా అయ్యే చమురు ద్వారానే 60శాతం వరకూ ఆ దేశ అవసరాలు తీరుతున్నాయి. రష్యా కంపెనీ లూకోఆయిల్‌కు చెందిన భారీ చమురు శుద్ధి కర్మాగారం 'నెఫ్టోచిమ్‌ బర్గాస్‌'.. బాల్కన్‌ ద్వీపకల్పంలోనే ఉంది. ఇక్కడ ఉత్పత్తయ్యే చమురు అంతా బల్గేరియా అవసరాలకే.

చైనా: ఐరోపా సమాజం(ఈయూ) తర్వాత రష్యా నుంచి రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనా.

ఐరోపా సమాజం(ఈయూ): 27 దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఈయూ.. సహజవాయువు అవసరాల్లో 40 శాతం, ముడి చమురు అవసరాల్లో 27శాతం మేర రష్యాపైనే ఆధారపడుతోంది. ఈయూ సభ్య దేశాలు కొన్ని రష్యాపై మరిన్ని ఆంక్షలకు డిమాండ్‌ చేస్తున్నప్పటికీ ఆ దేశం నుంచి ఇంధన దిగుమతులను అవి కొనసాగిస్తున్నాయి. వాటిలో ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌ ఇటలీ తదితర దేశాలున్నాయి.

ఫ్రాన్స్‌: గత ఏడాది ఫ్రాన్స్‌ మొత్తం ఇంధన దిగుమతుల్లో రష్యా వాటా 9.5శాతం వరకూ ఉంది. రష్యా నుంచి డీజిల్‌ కొనుగోలును నిలిపివేసినట్లు చెబుతోంది.

జర్మనీ: ఈ దేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం 'మిరో'కు సరఫరా అయ్యే ముడి సరకులో 14శాతం వరకూ రష్యానే అందిస్తుంది. రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్‌ కంపెనీ అనుబంధ సంస్థకు జర్మనీకి చెందిన పీసీకే ష్వెద్‌ రిఫైనరీలో 54 శాతానికిపైగా వాటా ఉంది.

గ్రీస్‌: ఈ దేశంలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రం 'హెలెనిక్‌ పెట్రోలియం'కు 15శాతం సరకు సరఫరా రష్యా నుంచే జరుగుతుంది. ఇప్పుడిప్పుడే సౌదీ అరేబియా నుంచి ఇంధన కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇటలీ: రష్యా ముడి చమురు ఆధారంగానే ఐఎస్‌ఏబీ అనే భారీ రిఫైనరీ నడుస్తోంది. ఈ నెల 4వ తేదీన కూడా ఈ కర్మాగారం యథావిధిగా పనిచేసిందని సమాచారం.

నెదర్లాండ్స్‌: ఈ దేశంలోని అత్యంత రద్దీ నౌకాశ్రయం.. రోటర్‌డామ్‌ పోర్టు. ఇక్కడి నుంచి జరిగే చమురు లావాదేవీల్లో రష్యా ఇంధన వాటా 30 శాతం. ఏడాదికి 2కోట్ల టన్నుల రష్యా ఇంధన ఉత్పత్తులు ఈ పోర్టు ద్వారానే వెళ్తుంటాయి. ఈ కార్యకలాపాలను నెదర్లాండ్స్‌ ప్రభుత్వం నిషేధించలేదు.

పోలండ్‌: ఈ దేశంలోని అతిపెద్ద రిఫైనరీ కూడా రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్‌కు పలు విధాలుగా పోలండ్‌ సహకరిస్తున్న విషయం తెలిసిందే.

టర్కీ: రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లను నిలిపివేసే ఉద్దేశం లేదని టర్కీ ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను వ్యతిరేకిస్తోంది.

russia export in crude oil
రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాలు

రవాణా ఖర్చులు భరిస్తూ.. రాయితీ ఇస్తూ..

ఇంధన అవసరాలకు భారత దేశం 80 శాతం వరకూ పూర్తిగా దిగుమతుల మీదే ఆధారపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగిన ప్రతిసారి ఆ భారం మన దేశంపై అధికమవుతూనే ఉంది. ఇంధన భద్రత పెద్ద సవాలుగా మారుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల నుంచి 140 డాలర్లకు ఎగబాకింది. అసలే అధిక ఇంధన ధరల సమస్యను ఎదుర్కొంటున్న భారత్‌కు ఇది అతి పెద్ద సవాల్‌ను విసిరింది. ఈ పరిస్థితుల్లో తాము ఎక్కడ తక్కువ ధరకు చమురు లభిస్తుందో అక్కడ నుంచి కొనుగోలు చేయకతప్పడంలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. భారత్‌ చట్టబద్ధమైన ఇంధన దిగుమతులపై అభ్యంతరం చెప్పటం తగదని పేర్కొన్నాయి. రష్యా నుంచి చమురును తరలించుకురావడం ఖరీదైన వ్యవహారం కావడంతో భారత కంపెనీలు ఇప్పటి వరకూ పెద్దగా అటువైపు దృష్టి సారించలేదు. అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రష్యా 20శాతం వరకు రాయితీ ఇస్తామని ప్రకటించడం, తమ నౌకల్లోనే తీసుకొచ్చి చమురును అందిస్తామని చెప్పడంతో భారత కంపెనీలకు రవాణాతో పాటు బీమా ఖర్చుల భారం తప్పిపోనుంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌), మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంఆర్‌పీఎల్‌) కంపెనీలు రష్యా నుంచి చమురు కొనుగోలుకు ముందుకు వచ్చాయి.

నిరాటంకంగా గ్యాస్‌ సరఫరా..

ఐరోపాలోని పలు దేశాలు సహజవాయువు అవసరాల కోసం పూర్తిగా రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతర్జాతీయ వాణిజ్య సంస్థల సమాచారం ప్రకారం 2020లో రష్యా గ్యాస్‌ను వినియోగించుకున్న దేశాల జాబితా ఇది.

ఇదీ చదవండి: హైపర్‌సోనిక్‌ ఎందుకింత డేంజర్​.. భారత్​లో ఈ మిసైల్ ఉందా?

Last Updated : Mar 20, 2022, 9:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.