Covishield Vaccine Protection: ఇతర యూరప్ దేశాలతో పోల్చితే 'కొవిషీల్డ్' వల్లే తమ దేశంలో కరోనా మరణాల రేటు తక్కువగా ఉందని అన్నారు బ్రిటన్ టీకా నిపుణుడు డా.క్లైవ్ డిక్స్ . కరోనాపై కొవిషీల్డ్ దీర్ఘకాలంగా పనిచేస్తుండటమే దీనికి కారణమని చెప్పారు.
"యూరప్‌లో కేసులు పెరిగే కొద్ది మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగాయి. కానీ యూకేలో అలా కాదు. బ్రిటన్‌లో చాలామంది కొవిషీల్డ్ తీసుకున్న కారణంగానే తక్కువ మరణాలు నమోదయ్యాయని నేను విశ్వసిస్తున్నాను."
-డా.క్లైవ్ డిక్స్, యూకే వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ మాజీ ఛైర్మన్
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని ఓ వెబ్సైట్ ప్రకారం.. బ్రిటన్‌లో ప్రతిరోజు ప్రతి పది లక్షల మందికి సగటు మరణాల రేటు 1.7గా ఉంది. కానీ యూరప్ మరణాల రేటు 4గా నమోదైంది.
Covishield Vaccine News: 'ఆర్ఎన్ఏ ఆధారంగా తయారైన ఫైజర్ టీకా.. ల్యాబ్ టెస్టుల్లో యాంటీబాడీలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. కానీ కొవిషీల్డ్ మాత్రం సెల్యులార్ ఇమ్యూన్ సిస్టమ్‌లో ఇతర భాగాలపై బాగా పనిచేస్తుంది. ఈ రకమైన రోగ నిరోధక శక్తి చాలాకాలం పాటు వైరస్‌పై పోరాటం చేయగలదు.' అని క్లైవ్ డిక్స్ అన్నారు. బూస్టర్ డోసుగా ఫైజర్ లేదా మోడెర్నాను వేసుకోవడంలో ఎలాంటి తప్పు లేనప్పటికీ.. ఇతర టీకాలను వేసుకోవడం ద్వారానే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్పారు.
ఇదీ చదవండి:
ఒమిక్రాన్‌కు చెక్ పెట్టేందుకు నాలుగో డోసు- ఆ దేశంలో ట్రయల్స్