రద్దీగా ఉన్న ప్రాంతంలో.. కొవిడ్-19 సోకిన వ్యక్తిని అక్కడిక్కడే పసిగట్టే ఒక సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సదరు వ్యక్తి శరీరం నుంచి వెలువడే వాసనను ఇది విశ్లేషించి, ఈ నిర్ధరణ చేస్తుంది. ఈ ఎలక్ట్రానిక్ సాధనానికి 'కొవిడ్ అలారం' అని పేరు పెట్టారు.
కరోనా బాధితుల నుంచి ఒకింత విభిన్నమైన వాసన వస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్(వీఓసీ)లో మార్పులే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. వీరిలో ప్రధానంగా కీటోన్, ఆల్డిహైడ్కు సంబంధించిన పదార్థాలు ఉంటాయని వివరించారు. వాసనపరంగా వాటికి ప్రత్యేక ముద్ర ఉంటుందని చెప్పారు. దీన్ని పసిగట్టేందుకు ఎల్ఎస్హెచ్టీఎం, రోబోసైంటిఫిక్ లిమిటెడ్, దర్హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు.. ఆర్గానిక్ సెమీ కండక్టింగ్ సెన్సర్లతో ఒక సాధనాన్ని రూపొందించారు.
ఇవీ చదవండి: వైరల్ ఇన్‌ఫెక్షన్.. భవిష్యత్‌లో ఎలా ఉండొచ్చు?