ETV Bharat / international

మరో రెండేళ్లలోనే కరోనా ఖతం: డబ్ల్యూహెచ్​ఓ

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను రెండేళ్లలోపే కట్టడిచేసే అవకాశం ఉందన్నారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్. వందేళ్ల కింద వచ్చిన స్పానిష్ ఫ్లూ కంటే తక్కువ సమయంలోనే కరోనా అంతమొందుతుందని తెలిపారు. కరోనా వంటి మహమ్మారులు శతాబ్దానికి ఓసారైనా మన ప్రపంచాన్ని శుద్ధి చేసుకుని, పునర్ నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నాయన్నారు.

covid-19-pandemic-could-be-over-within-2-years-who
"మరో రెండేళ్లలో కరోనా ఖతం!"
author img

By

Published : Aug 22, 2020, 3:37 PM IST

Updated : Aug 22, 2020, 3:43 PM IST

కరోనా మహమ్మారిని ప్రపంచం రెండేళ్లలోనే అంతమొందిస్తుందని అభిప్రాయపడ్డారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. ఈ మహమ్మారి మనకు ఆరోగ్యం, ఆర్థిక పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పింది అని ఆయన ఉటంకించారు. కరోనా మహమ్మారి శతాబ్దానికి ఒక్కసారి వచ్చే మహమ్మారే కావచ్చు కానీ, మన ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా, పరిశుభ్రంగా మార్చుకునేందుకు శతాబ్దానికి ఓ సారి వచ్చే అవకాశంగా పరిగణించాలని అభిప్రాయపడ్డారు.

1918 నాటి స్పానిష్ ఫ్లూ అంతమొందడానికి రెండేళ్లు పట్టింది కానీ, కరోనా అంతకన్నా తక్కువ సమయంలోనే అంతమవుతుందన్నారు టెడ్రోస్.

ప్రపంచీకరణ ప్రభావం కారణంగా కొవిడ్-19 శరవేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ.., దీన్ని నియంత్రించడానికి ప్రస్తుతం సాంకేతికత అందుబాటులో ఉందన్నారు. అందరం కలిసికట్టుగా కృషి చేస్తే మహమ్మారిని రెండేళ్లలోనే మట్టుబెట్టొచ్చన్నారు.

ఇదీ చదవండి: మా మంచి 'మంచు గణపయ్య'!

Last Updated : Aug 22, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.