ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. గురువారం కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 13 కోట్ల 45 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు.
మొత్తం కేసులు: 13,45,08,532
మొత్తం మరణాలు: 29,14,774
కోలుకున్న వారు: 10,83,04,112
యాక్టివ్ కేసులు: 2,32,89,646
- అమెరికాలోని మిషిగాన్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో రోజుకు 7వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.
- మసాచుసెట్స్లోనూ వరుసగా ఏడు రోజులనుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం కొత్తగా 2,100 మందికి వైరస్ నిర్ధరణ అయింది.
- అమెరికా, పెరూ తర్వాత.. ఒక్కరోజులో కొవిడ్ మరణాలు 4 వేలు దాటిన దేశంగా బ్రెజిల్ నిలిచింది.
- ఇరాన్లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 22వేల 600 మంది కరోనా బారినపడ్డారు.
- 21 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్లో.. దాదాపు 3 శాతం( 63 లక్షలు) మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు.
- దక్షిణ కొరియాలో గురువారం 700కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి 5 తర్వాత ఇదే అత్యధికం. ఈ దేశంలో కఠిన ఆంక్షలు విధించే అవకాశముంది.
ఇదీ చదవండి : అమెరికాలో కాల్పుల కలకలం- ఒకరు మృతి