ETV Bharat / international

'ధనిక దేశాలు టీకా సమాచారం పంచుకోవాలి'

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చినా అది కేవలం అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పేద దేశాలకు వ్యాక్సిన్​ అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా.. పలు అంతర్జాతీయ సంస్థలు చేస్తోన్న ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడం లేదు. టీకా తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాచారాన్ని పంచుకోవాలని పలు దేశాలు దిగ్గజ ఫార్మా సంస్థలను కోరుతున్నాయి.

Countries call on drug companies to share vaccine know-how
టీకా తయారీ పరిజ్ఞానాన్ని బదలాయించండి
author img

By

Published : Mar 2, 2021, 5:29 AM IST

ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​కి తగినట్టుగా కొవిడ్​ టీకాల సరఫరా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ధనిక దేశాలు తమ వ్యాక్సిన్​ ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకోకపోవడం వల్ల టీకా ఉత్పత్తి, సరఫరాలో జాప్యం ఏర్పడుతోంది.

బంగ్లాదేశ్​లోని ఓ పెద్ద నగర శివారులో జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న పరికరాలతో వ్యాక్సిన్​ ఉత్పత్తి ​ కోసం ఓ కర్మాగారాన్ని స్థాపించారు. అయితే.. అందులోని కొన్ని గదులను పూర్తిగా కప్పేసి ఉంచారు. ప్రస్తుతం ఆ కర్మాగారంలో నాలుగింట ఒకవంతు వద్ద మాత్రమే పనులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్​లోనే కాకుండా ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా మరో మూడు కర్మగారాలు ఉన్నాయని అసోసియేటెడ్​ ప్రెస్​ వార్తా సంస్థ తన పరిశోధనలో తెలిపింది. కానీ, వాటిలో ప్రస్తుతం వ్యాక్సిన్​ ఉత్పత్తి ప్రక్రియ జరగటం లేదు. టీకా తయారీకి సంబంధించిన బ్లూ ప్రింట్​, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తే.. తక్కువ సమయంలో లక్షలాది టీకాలను తాము ఉత్పత్తి చేయగలమని వాటి యజమానులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: టీకా పంపిణీపై జీ7 దేశాల హామీ

10దేశాల్లోనే.. 80శాతం టీకాలు..

టీకా తయారీలో బ్రిటన్ సహా.. ఐరోపా సమాఖ్య, అమెరికా దేశాలకు చెందిన దిగ్గజ ఫార్మా కంపెనీలైన ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకాల వద్ద ఉన్న సాంకేతికతను పంచుకోవాల్సిందిగా పలు దేశాలు కోరుతున్నాయి. అయితే ఆయా కంపెనీల స్పందన మాత్రం అంతంతమాత్రంగా ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల్లో అధికం ధనిక దేశాలకే అందుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటివరకు దాదాపు 80 శాతం వ్యాక్సిన్లు కేవలం 10 దేశాల్లోనే పంపిణీ అయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక తెలిపింది. మరోవైపు 210 దేశాల్లోని 250 కోట్ల మంది జనాభాకు ఒక్క డోసూ అందలేదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'టీకాలు కొనే ముందు ధనిక దేశాలు ఆలోచించాలి'

టీకా ధరలపైనా..

టీకా కొనుగోలుకు పలు దేశాలు మొగ్గుచూపుతున్నా.. ఒక్కో దేశంలో ధర ఒక్కోలా ఉంది. దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్, ఉగాండా దేశాల్లో ఆస్ట్రాజెనెకా డోసుల ధరల్లో వ్యత్యాసంపై విమర్శలొచ్చాయి. ఒకే టీకా ధర వివిధ దేశాల్లో భిన్న ధరల్లో అందుబాటులో ఉండటం సబబేనా? అనే ప్రశ్న తలెత్తింది. దీనిపై స్పందించిన ఆస్ట్రాజెనెకా తమకొచ్చిన ఆర్డర్లు, డోసుల ఉత్పత్తిని బట్టి ధర మారుతుంటుందని తెలిపింది.

'కొవాక్స్' కోసం భారత్​ 1.1 బిలియన్ డోసులు'

'కొవాక్స్​'కు వ్యతిరేకం..

పేద దేశాలకు కరోనా టీకా అందించేందుకు ఐరాస ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రపంచ కూటమి 'కొవాక్స్​'కి 164 సభ్య దేశాల మద్దతుండగా.. ఇందులో 119 ఆఫ్రికా దేశాలే కావడం గమనార్హం. అయితే టీకా తయారీదారులు కొవాక్స్ కార్యక్రమాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం గమనార్హం. ప్రపంచ టీకా కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం సహా.. టీకాల తయారీలో ఉపయోగించే సాంకేతికత, మేధో సంపత్తి హక్కులను స్వచ్ఛందంగా పంచుకోవడం వంటి చర్యలతో వ్యాక్సిన్ కొరత నుంచి బయటపడొచ్చని వివిధ దేశాల ప్రభుత్వాలతో పాటు.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి:

'అందరికీ టీకా.. 2021లోనే అతిపెద్ద సవాల్​'

కొవిడ్​ టీకా ధరలపై షా అసంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.