ETV Bharat / international

21 వేలు దాటిన కరోనా మరణాలు - కొవిడ్​-19 లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. కొవిడ్​-19 ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 21వేలు దాటింది. మొత్తం 4 లక్షల 66 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఐరోపాలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. తాజాగా ఇటలీలో 683 మంది మరణించారు. స్పెయిన్​లో 24 గంటల వ్యవధిలోనే 783 మంది బలయ్యారు.

Coronavirus deaths top 20,000 worldwide, mostly in Europe: AFP tally
21 వేలు దాటిన కరోనా మరణాలు
author img

By

Published : Mar 26, 2020, 5:58 AM IST

కరోనా రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4 లక్షల 66 వేల మందికిపైగా వైరస్​ సోకగా.. మరణాల సంఖ్య 21వేలు దాటింది. 196 దేశాల్లో 21 వేల 180 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలో కొవిడ్​-19 వ్యాప్తి అధికమవుతోంది. ఇటలీలో కొత్త కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ మరణాలు మాత్రం తగ్గడం లేదు. అక్కడ ఒక్కరోజే 683 మంది మృతి చెందారు. మొత్తం మరణాలు 7 వేల 500దాటాయి. 5 వేల 210 కొత్త కేసులు నమోదవగా.. మొత్తం కేసుల సంఖ్య 74 వేల 386కు చేరింది.

చైనాను దాటిన స్పెయిన్​..

ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన స్పెయిన్​.. ఇటలీ తర్వాత అంతటి ఆందోళనకర పరిస్థితుల్లోకి వెళ్లింది. ఒక్కరోజులోనే అక్కడ 783 మందిని కరోనా బలితీసుకుంది. మొత్తం కేసులు 50 వేలకు సమీపంలో ఉండగా.. మరణాలు 3, 647కు చేరాయి.

అమెరికాలో...

కొవిడ్​-19 అమెరికాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. 24 గంటల వ్యవధిలో మరోసారి అక్కడ కొత్త కేసులు దాదాపు 10వేలకు చేరాయి. మొత్తం మృతుల సంఖ్య 900 దాటింది. పరిస్థితులు విషమిస్తున్న తరుణాన న్యూయార్క్​కు 24 లక్షల మాస్కులు, 1.35 కోట్ల చేతి తొడుగులు, 4 వేల వెంటిలేటర్లను పంపించనున్నట్లు తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.

కరోనా నిర్ధరణ కిట్లను సరఫరా చేయాల్సిందిగా దక్షిణ కొరియాను కోరారు. కొవిడ్​ తీవ్రతకు కుదేలవుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దేశించిన 2 లక్షల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీ ఆమోదంపై సెనేట్​, శ్వేతసౌధం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఒక్కరోజులో ఫ్రాన్స్​లో 231, ఇరాన్​లో 143, నెదర్లాండ్స్​లో 80, బెల్జియంలో 56, జర్మనీలో 47 మంది మృత్యువాతపడ్డారు.

యూకేలో మరణాల సంఖ్య 465కు చేరింది. 1452 కొత్త కేసులతో మొత్తం కేసులు 9,529గా ఉన్నాయి. చైనాలో బుధవారం రోజు నలుగురు చనిపోగా.. 47 కొత్త కేసులు నమోదయ్యాయి. దాయాది దేశం పాకిస్థాన్​లో 91 కొత్త కేసులతో మొత్తం 1063 మంది బాధితులున్నారు. మరణాల సంఖ్య 8గా ఉంది. కేసులు పెరుగుతున్న కారణంగా.. దేశీయ విమానాల రాకపోకలపై ఇమ్రాన్​ సర్కారు ఆంక్షలు విధించింది. రష్యాలో రెండో కొవిడ్​ మరణం చోటుచేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.