ETV Bharat / international

అమెరికాలో ఒక్కరోజే 1900 మంది బలి - లాక్​డౌన్​ పొడిగింపు

కరోనా వైరస్​ మృత్యుఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కేసులు 16 లక్షలు దాటింది. మృతుల సంఖ్య 96వేలకు చేరువైంది. అత్యధికంగా ఇటలీలో 18 వేల 200, అమెరికాలో దాదాపు 17 వేల మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఒక్కరోజే అమెరికాలో 1900 మంది కరోనాకు బలయ్యారు. చైనాలో కొత్తగా మరో 42 మందికి వైరస్​ సోకగా.. ఒక మరణం నమోదైంది.

Coronavirus death toll crosses 16,000 in US
అమెరికాలో ఒక్కరోజే 1900 మంది బలి
author img

By

Published : Apr 10, 2020, 10:25 AM IST

Updated : Apr 10, 2020, 10:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్​.. రోజూ వేలాది మందిని బలిగొంటోంది. గురువారం ఒక్కరోజే 7 వేల 235 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 95 వేల 735కు చేరింది. మొత్తం కేసులు 16 లక్షల 4 వేలు దాటాయి. ఐరోపాలోనే 65 వేల మందికిపైగా మరణించారు. ఆసియాలో 9,900కుపైగా కొవిడ్​కు బలయ్యారు.

ఇటలీలో అత్యధికంగా 18,279 మంది కొవిడ్​కు బలయ్యారు. 16697, 15447 మరణాలతో అమెరికా, స్పెయిన్​లు వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి.

ఒక్కరోజే 1900 మంది...

అమెరికాలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. మరో కోటీ 60 లక్షల మందిని నిరుద్యోగులుగా మిగిల్చింది. అమెరికా జనాభాలో 97 శాతం జనం ఇంటివద్దే ఉన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్.. దాదాపు 50 రాష్ట్రాలకు అతిపెద్ద విపత్తు ప్రకటన జారీచేశారు.

దేశంలో మొత్తం కేసులు 4 లక్షల 68 వేలు దాటగా.. గురువారం ఒక్కరోజే 1900 మంది మరణించారు. కరోనాకు కేంద్రంగా ఉన్న న్యూయార్క్​లోనే 800కుపైగా ప్రాణాలు కోల్పోయారు. అక్కడ మొత్తం మృతుల సంఖ్య 7వేలకుపైనే.

అక్కడ మరో 42...

చైనాలో గురువారం మరో 42 మందికి వైరస్​ సోకింది. ఇందులో 38 మంది విదేశాల నుంచి వచ్చినవారే. మొత్తం కేసులు 82 వేలకు చేరువయ్యాయి. గురువారం మరొకరు మరణించగా.. మొత్తం మృతులు 3,336కు చేరారు.

కేసులు మళ్లీ పెరుగుతున్న దృష్ట్యా.. కొవిడ్​ నుంచి కోలుకున్న వారిని తిరిగి పరీక్షించనున్నట్లు అధికారులు వెల్లడించారు. వుహాన్​లో 76 రోజుల సుదీర్ఘ లాక్​డౌన్​ ఎత్తివేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

ఆ కేసులు 47...

లక్షణాలు కనిపించని కొత్త కరోనా కేసులు మరో 47 నమోదయ్యాయి. ఈ సంఖ్య మొత్తం 1097గా ఉంది. 349 మంది విదేశీయులు.

కొరియాలో..

దక్షిణ కొరియాలో మరో 27 కేసులు, నాలుగు మరణాలు సంభవించాయి.

హాంగ్​కాంగ్​లో మరో 973 కేసులు నమోదయ్యాయి. గురువారం నలుగురు చనిపోయారు.

Coronavirus death toll crosses 16,000 in US
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం

లాక్​డౌన్​ పొడిగింపు..

దక్షిణాఫ్రికాలో లాక్​డౌన్​ మరో 2 వారాలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు సిరిల్​ రామఫోసా. ఇప్పటికే అక్కడ 21 రోజుల లాక్​డౌన్​ అమల్లో ఉంది.

మంత్రులు సహా ప్రభుత్వ ఉన్నతాధికారులకు 3 నెలల పాటు వేతనాల్లో మూడింట ఒక వంతు(దాదాపు 30 శాతం) కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్​ బాధితులకు సహాయార్థం ఈ మొత్తం సంఘటిత నిధికి వెళ్తుందని స్పష్టం చేశారు.

ఈయూ ప్యాకేజీ..

కరోనా మహమ్మారితో అతలాకుతలమైన ఐరోపా సమాఖ్య ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు.. ఆయా ఆర్థిక మంత్రులు భారీ ఒప్పందానికి అంగీకరించారు. 550 బిలియన్​ డాలర్ల ప్యాకేజీని కుదుర్చుకున్నారు. ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​ దేశాలు చేసిన రుణ ప్రతిపాదన(కరోనా బాండ్​)ను పట్టించుకోకపోవడం గమనార్హం.

Last Updated : Apr 10, 2020, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.