ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 10లక్షలు దాటిన కరోనా కేసులు - కరోనా వైరస్​ కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కేసుల సంఖ్య 10 లక్షలు(మిలియన్​) దాటింది. మృతుల సంఖ్య కూడా 50వేలను దాటింది. వైరస్​ ధాటికి ప్రపంచంలోని సగం జనాభా.. ఇళ్లకే పరిమితమవనుంది.

Coronavirus cases top 1 million worldwide: AFP tally
ప్రపంచవ్యాప్తంగా 10లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : Apr 3, 2020, 5:17 AM IST

Updated : Apr 3, 2020, 7:28 AM IST

మానవాళిపై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్​ కేసుల సంఖ్య 10లక్షలు(మిలియన్​) దాటింది. ఇప్పటివరకు మొత్తం 10,14,256మంది వైరస్​ బారినపడ్డారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 50వేలను దాటింది. వైరస్​ బారినపడి ఇప్పటివరకు 52వేల 982మంది ప్రాణాలు కోల్పోయారు.

ఒక్క ఐరోపాలోనే 37వేలకుపైగా మంది వైరస్​తో మరణించారు. ఇటలీ, స్పెయిన్​, ఫ్రాన్స్​లో మృతుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది.

సగం జనాభా ఇళ్లల్లోనే...

థాయ్​లాండ్​లో కరోనా​ వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆ దేశంలో కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఫలితంగా వైరస్​ ధాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.9 బిలియన్​ మంది ఇళ్లకే పరిమితమవనున్నారు. 3.9 బిలియన్​ అంటే.. ప్రపంచంలోని సగం జనాభాతో సమానం.

వైరస్​ కట్టడికి.. దాదాపు 90 దేశాలు ఇప్పటికే లాక్​డౌన్​, కర్ఫ్యూ పద్ధతులను పాటిస్తున్నాయి.

డెమొక్రాట్ల సదస్సు వాయిదా..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపైనా వైరస్​ ప్రభావం పడేలా కనపడుతోంది. తాజాగా.. తమ అభ్యర్థిని ప్రకటించేందుకు డెమొక్రాట్లు ఏర్పాటు చేసిన సదస్సు.. జులై 13 నుంచి ఆగస్టు 17కు వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో సదస్సును వాయిదా వేయడమే శ్రేయస్కరమని డెమొక్రాట్లు భావించారు.

అయితే ఆగస్టు 24-27 మధ్య జరగాల్సిన రిపబ్లికెన్​ సదస్సులో ఎలాంటి మర్పులు ఉండబోవని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

వైరస్​తో అమెరికా గడగడలాడుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 2లక్షలు దాటిపోయింది. మృతుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా న్యూయార్క్​ వైరస్​ ధాటికి విలవిలలాడుతోంది. మృతదేహాలతో ఆసుపత్రులు, శ్మశానాలు ఇప్పటికే నిండిపోయాయి. దీనితో 'మొబైల్​ మార్గ్'ను ఏర్పాటు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. దాదాపు 45 మొబైల్​ మార్గ్స్​లో 3వేల 500 మృతదేహాల వరకు పెట్టవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరో 85 రిఫ్రిజరేటర్లూ అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం.

ఉద్యోగాల కోత...

బ్రిటిష్​ ఎయిర్​వేయిస్​.. సంస్థలోని 60శాతం(28వేలు) మందిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. కరోనా వైరస్​ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే ప్రభుత్వ పథకాల ద్వారా.. ఆ 28వేల మందికి 80శాతం జీతాలను అందించనున్నట్టు హామీనిచ్చింది.

ఇదీ చూడండి:- 'నమ్మండి ప్లీజ్... మా దేశంలో ఎవరికీ కరోనా రాలేదు!'

Last Updated : Apr 3, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.