స్మార్ట్‌వాచ్‌లు కట్టుకోండి.. ఫిట్‌నెస్ బ్యాండ్‌లు పెట్టుకోండి.. జర్మనీ ఇప్పుడు ప్రజలను ఇదే కోరుతోంది. ఇలా చేయడం ద్వారా ఆరోగ్య సమాచారాన్ని పంచుకునేందుకు సులువుగా ఉంటుందని అక్కడి ‘వ్యాధుల నివారణ కేంద్రం’ తేల్చింది. సమాచార మార్పిడికి అనువుగా ఉండేందుకు ‘కరోనా డేటా డొనేషన్’ అనే ఉచిత యాప్‌ను అక్కడి అధికారులు అందుబాటులోకి తెచ్చారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లకు అనుసంధానించుకుంటే ప్రతి ఒక్కరికీ ఒక పోస్ట్‌కోడ్ వస్తుంది. అందులోకి లాగిన్ అయితే వయసు, బరువు, నిద్ర అలవాట్లు, గుండె కొట్టుకునే తీరు, శరీర ఉష్ణోగ్రత లాంటి వివరాలన్నీ తెలిసిపోతాయి.
కరోనా లక్షణాలు ఎవరికైనా ఉంటే ఈ యాప్ ద్వారా ‘వ్యాధుల నివారణ కేంద్రం’ ఇట్టే తెలుసుకుంటుంది. వెంటనే వారిని అప్రమత్తం చేస్తుంది.