ETV Bharat / international

ముక్కు ద్వారా మెదడులోకి కరోనా - కొవిడ్​ వార్తలు

కరోనా మహమ్మారి ముక్కు ద్వారా మెదడులోకి వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చారు జర్మనీ శాస్త్రవేత్తలు. మెదడులోకి ఈ సూక్ష్మజీవి ప్రవేశిస్తున్న తీరు.. ఆ తర్వాత అవయవంలోని వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతున్న విధానాన్ని ఆవిష్కరించారు.

Corona into the brain
ముక్కు ద్వారా మెదడులోకి కరోనా
author img

By

Published : Dec 1, 2020, 7:09 AM IST

కరోనా వైరస్​.. బాధితుల మెదడులోకి ప్రవేశిస్తున్న తీరును జర్మనీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ముక్కు ద్వారానే మెదడులోకి వ్యాప్తి చెందుతున్నట్లు తేల్చారు. కరోనా వైరస్​ ప్రధానంగా బాధితుల శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. అక్కడితో ఆగకుండా కేంద్ర నాడీ వ్యవస్థకూ వ్యాపిస్తోంది. అందుకే బాధితులకు రుచి, వాసన సామర్థ్యం తగ్గిపోవడంతోపాటు తలనొప్పి, అలసట, ఒళ్లు తిప్పడం వంటి నాడీ సంబంధ రుగ్మతలు తలెత్తుతున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

నిజానికి మెదడు, సెరిబ్రోస్పైనల్​ ఫ్లూయిడ్​లో వైరస్​కు సంబంధించిన ఆర్​ఎన్​ఏను ఇప్పటికే గుర్తించారు శాస్త్రవేత్తలు. మెదడులోకి ఈ సూక్ష్మజీవి ప్రవేశిస్తున్న తీరు, ఆ తర్వాత ఆ అవయవంలోని వివిధ భాగాలకు వ్యాప్తి చెందుతున్న విధానంపై పరిశోధకులకు స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో జర్మనీ శాస్త్రవేత్తలు.. కొవిడ్​తో మరణించిన 33 మంది మృతదేహాలను పరిశీలించారు. గొంతులోని నాసోఫ్యారింక్స్​తోపాటు మెదడుపై దృష్టిపెట్టారు. వైరస్​కు సంబంధించిన ఆర్​ఎన్​ఏ, ప్రొటీన్లను ఈ రెండు భాగాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసోఫ్యారింక్స్​లో అత్యధిక స్థాయిలో ఆర్​ఎన్​ఏ కనిపించింది. ముక్కులోని ఆల్​ఫ్యాక్టరీ శ్లేష్మ పొరలోని కొన్ని కణాల్లో వైరస్​కు సంబంధించిన స్పైక్​ ప్రొటీన్లు వెలుగు చూశాయి. ఈ పొరలోని కణజాలానికి నాడీ కణజాలం దగ్గరగా ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని వైరస్​, మెదడులోకి వ్యాపించి ఉండొచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నివారణే విజేత.. ఎయిడ్స్​ను తరిమేయండిక!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.