ETV Bharat / international

'వాయు ఉద్గారాలపై ధనిక దేశాల విధానం సరికాదు'​

author img

By

Published : Dec 11, 2019, 9:48 PM IST

ప్రపంచ ధనిక దేశాలు వాయు ఉద్గారాలను తగ్గించటానికి ఎంచుకుంటున్న మార్గాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని  పర్యావరణవేత్త గ్రెటా థన్​బర్గ్​ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు సరైన చర్యలు చేపట్టాలని కోరారు.

Climate pledges 'misleading', Greta tells UN meet
థన్​బర్గ్​

సంపన్న దేశాలు వాయు ఉద్గారాలను తగ్గించటానికి అనుసరించే మార్గాలు ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని స్వీడన్‌కు చెందిన యువ పర్యావరణవేత్త గ్రెటా థన్‌బర్గ్‌ ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో వ్యాఖ్యానించారు.

పారిస్​ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతను రెండు డిగ్రీల సెల్సియస్​కు పరిమితం చేయటం, 1.5 సెల్సియస్​ వరకు అదుపు చేసేందుకు అనుసరించాల్సిన నిబంధనల రూపకల్పనపై స్పెయిన్ రాజధానిలో పలు దేశాలు సమావేశమయ్యాయి. వాతావరణ మార్పుపై పోరాటానికి ఎలా నిధులు సమకూర్చాలి, కార్బన్ ట్రేడింగ్ పథకాలను ఎలా నియంత్రించాలి అనే విషయాలపై చర్చించాయి.

ఈ సందర్భంగా మాట్లాడిన థన్​బర్గ్​.. పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని కోరారు.

"ఇటీవల కొన్ని ధనిక దేశాలు గ్రీన్ హౌస్​ వాయువుల ఉద్గారాలను చాలా శాతం తగ్గిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. వినడానికి మొదట్లో బాగానే ఉన్నా, వాళ్ల అభిమతం మంచిదే అయినా ఇది తప్పుదోవ పట్టించేలా ఉంది. "
- గ్రెటా థన్​బర్గ్​, పర్యావరణవేత్త.

పరిశ్రమలు వ్యాపారాలను హరితంగా మార్చి కార్బన్​ ఉద్గారాలను కనిష్ఠ స్థాయికి చేర్చేందుకు కృష చేయాలని ఐరాస అధ్యక్షుడు ఆంటోనియో గుటెరస్ కోరారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉద్గారాలు ప్రతి ఏటా 7.6శాతం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రత 1.5 సెల్సియస్​కు చేరేలా చూడాలన్నారు.

2015 నాటి పారిస్​ ఒప్పందాన్ని అమలు చేయాలని పదుల సంఖ్యలో సమావేశాలు జరిగినా.. వేలాది మంది నిపుణులు కృషి చేస్తున్నా ఉద్గారాలు ప్రతిఏటా 4శాతం పెరుగుతూ వస్తున్నాయి.

ఇదీ చూడండి:పౌర' ఎఫెక్ట్: ఈశాన్య భారతంలో ఆందోళనలు ఉద్ధృతం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.